టాలీవుడ్ బడా నిర్మాతలు చాలా మంది ఇప్పుడు టాక్స్ ల వలలో చిక్కుకుని గిలగిల లాడుతున్నారు. టాలీవుడ్ నుంచి కనీసం 100 కోట్లకు పైగా పెనాల్టీ రూపంలో ఆదాయపన్ను శాఖకు త్వరలో రావచ్చు అనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తోంది. టాలీవుడ్ లోని రెండు పెద్ద సంస్థలు, ఇద్దరు ముగ్గురు చిన్న నిర్మాతలు అందరి దగ్గర నుంచి ఈ మేరకు పెనాల్టీ రూపంలో ఆదాయపన్ను శాఖకు రావచ్చని అంచనాలు వినిపిస్తోంది.
ఇటీవలే చాలా సంస్థల మీద దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఆదాయపన్ను శాఖ దాడుల వైనం ఎలా వుంటుంది అంటే, అసలు దాడులు జరిగాయా లేదా అన్నది కూడా అధికారికంగా చెప్పరు. జస్ట్ దాడులు జరిగాయి అని న్యూస్ లో వస్తుంది అలా అలా తెలుసుకున్న సమాచారం ద్వారా. ఆ తరువాత మరేమి అయిందో తెలియదు. ఏం దొరికిందో, దొరకలేదో, అన్నది అధికారికంగా చెప్పరు. ఆదాయపన్ను శాఖ విధి విధానాలు, రూల్స్ అలా వుంటాయి. అందువల్ల అలాట..ఇలాట..అని ట కబుర్లు చెప్పుకోవడమే. అయితే టాలీవుడ్ లో ఇన్ సైడ్ వర్గాల్లో అన్ని సమాచారాలు వినిపిస్తూనే వుంటాయి.
టాలీవుడ్ లో వినిపిస్తున్న ఈ సమాచారం ప్రకారం ఈసారి జరిగిన ఆదాయపన్ను శాఖ దాడులు టాలీవుడ్ ను కాస్త గట్టిగా కుదిపేసాయి. కేవలం మూడు నాలుగు నిర్మాణ సంస్థలకు మాత్రమే పరిమితం కాలేదు ఈ దాడులు. ఆ సంస్థలతో లింక్ వున్న ఫైనాన్సియర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్నేహితులకు కూడా చుట్టుకున్నాయి. వీళ్ల దగ్గర దొరికిన లింక్ లతో, డాక్యూమెంట్లతో, ఫోన్ మెసేజ్ లతో, ఫోన్ ల్లో వుండే ఎక్స్ ఎల్ రికార్డులతో ఒకరికి ఒకరికి లింక్ లు పడ్డాయి.
ఇప్పుడు ఈ జనాలు అంతా ఇన్ కమ్ టాక్సు ఆఫీసుల చుట్టూ వాయిదాలకు తిరుగుతున్నారు. దాదాపు ఇటీవల దాడులు జరిగిన అందరూ ఇన్ కమ్ టాక్స్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ప్రతి చోటా సీజ్ చేసిన బంగారు ఆభరణాలు, బీరువాలు అన్నీ ఇప్పుడిప్పుడే విడుదల చేసారు. ఇక దొరికిన ఆధారాల మేరకు రోజు విడిచి రోజు, లేదా వారానికి రెండు రోజులు సంబంధిత అధికారుల దగ్గర విచారణలు జరుగుతున్నాయి.
ఓ పెద్ద నిర్మాణ సంస్థ గట్టి ఇబ్బందుల్లో ఇరుక్కుందని తెలుస్తోంది. ఈ సంస్థ ఓ భారీ పాన్ ఇండియా లేదా పాన్ వరల్డ్ సినిమాను పంపిణీ చేసింది. ఆ టైమ్ లో ఆ సినిమా నిర్మాత పది కోట్లు బ్లాక్ కావాలని అడిగినట్లు తెలుస్తోంది. అలా ఇవ్వడంతో, దాన్ని థియేటర్ కలెక్షన్ల దగ్గర అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది. ఇలా అన్ని థియేటర్ల దగ్గర అడ్జస్ట్ చేసారు. ఇది కామన్ ప్రాక్టీస్. భారీ సినిమాలు అన్నింటికీ ఇలా జరుగుతూ వుంటుంది.
అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే ఈ పనులు చూసే ఆఫీసు అకౌంటెంట్ మొత్తం వివరాలు ఓ బుక్ లో రాసుకున్నారు. ఎందుకంటే యజమాని ఎప్పుడు అడిగితే అప్పుడు చెప్పాలి కదా. కానీ ఆ బుక్ ను ఎక్కడో దాచకుండా ఆఫీసులోనే వుంచినట్లు తెలుస్తోంది. అది కాస్తా ఆదాయపన్ను శాఖకు దొరికినట్లు టాలీవుడ్ లో వినిపిస్తోంది. దాంతో ఇప్పుడు ఆ సంస్థకు కనీసం 40 నుంచి 50 కోట్లు పెనాల్టీ పడక తప్పదని జనాలు చెప్పుకుంటున్నారు.
మరో సంస్థ ఇటు ఆదాయపన్ను లెక్కలతో పాటు, జిఎస్టీ వ్యవహారం కూడా ఎదుర్కోవాల్సి వస్తోందని తెలుస్తోంది. ఈ సంస్థకు మరో నిర్మాతకు మధ్య జరిగిన లావాదేవీలు ఒకరి ఫోన్ లో ఎక్స్ ఎల్ షీట్ ద్వారా దొరికాయని తెలుస్తోంది. దాని వల్ల ఇప్పుడు ఈ బడా సంస్థ కూడా దాదాపు 50 కోట్ల వరకు పెనాల్టీ కట్టాల్సి వస్తుందని తెలుస్తోంది. అయితే ఆ మరో నిర్మాతకు మాత్రం ఇతరత్రా వ్యాపారాలు వుండడం వల్ల పెద్దగా ఇబ్బంది వుండదని అంటున్నారు.
కష్టాల్లో వున్న ఓ నిర్మాత కూడా పన్ను సమస్యలు ఎదుర్కుంటున్నారు. అసలే సినిమాలు ఆడక, ఆర్థిక ఇబ్బందుల్లో వుంటే, ఆర్థిక లావాలేవీలు సంబంధించి చాలా పన్ను ఎగవేతలు కనిపించడంతో అకౌంట్లు అన్నీ సీజ్ చేసారని తెలుస్తోంది. ఇప్పుడు అవన్నీ మళ్లీ రెగ్యులర్ కావాలి అంటే ముందుగా కొన్ని కోట్లు అయినా డిపాజిట్ చేయాల్సి వుంటుంది.
టాలీవుడ్ మొత్తం మీద సంస్థలు అయితేనేం, వ్యక్తులు అయితేనేం దాదాపు అయిదు నుంచి ఆరుగురు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీళ్లందరి కేసులు తేలి, అన్ని లెక్కలు తేలితే ఎంత లేదన్నా కనీసం 100 కోట్లు ఆదాయపన్ను శాఖకు పెనాల్టీ రూపంలో కట్టాల్సి వుంటుంది అని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
దీంతో ఇప్పుడు ప్రతి నిర్మాణ సంస్థ అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. కనీసం వేదికల మీద మాట కూడా జారడం లేదు.
కాల్ బాయ్ జాబ్స్ >>> ఏడు, తొమ్మిది, తొమ్మిది,
Andhukane vedabalaku adhe heros ani cheppukune vallaku black money ivvaddhu
Ammo
ఏదో ఒక రకంగా ప్రభుత్వానికి ఆదాయం వస్తే మంచిదే కదా!