మలయాళంలో అల్లు అర్జున్‌కి ఉన్న రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లెద్దు. డబ్బింగ్ బొమ్మే అయినా.. మల్లూవుడ్‌లో బన్నీ దడదడలాడించేస్తుంటాడు. అందుకే గుణశేఖర్ కూడా బన్నీ ఇమేజ్‌ని అక్కడ క్యాష్ చేసుకొనే పనిలో పడ్డాడు. ఈ సినిమాని మలయాళంలో 'రుద్ర'గా విడుదల చేస్తున్నారు.
పోస్టర్లలో ఎక్కడ చూసినా బన్నీ ఫొటోనే కనిపించేలా జాగ్రత్త తీసుకొంటున్నారు. బన్నీ క్రేజ్‌తో రుద్రమదేవి మలయాళ రైట్స్‌కి మంచి డిమాండే వస్తోందట. అయితే ఈ సినిమాలతో బన్నీ కనిపించేది 20 నిమిషాలే.
సినిమా అంతా అనుష్కని పెట్టుకొని, బన్నీని అతిథి పాత్రతో చూపిస్తే.. బన్నీ కోసం టికెట్టు కొన్న మల్లూవుడ్ ఆడియన్ ఏమంటాడో..?