జ్యోతి లక్ష్మీ యాపారం బాగుంది

చకచకా తీసేసి, విడుదలకు రెడీ చేసేసాడు పూరి జగన్నాధ్ జ్యోతిలక్ష్మి సినిమాకు. ట్రయిలర్ కు ముందే బిజినెస్ ప్రారంభించి, అడియో ఫంక్షన్ తో పాటే అది కూడా పూర్తి చేసేసాడని టాక్.  Advertisement నిర్మాణంలో…

చకచకా తీసేసి, విడుదలకు రెడీ చేసేసాడు పూరి జగన్నాధ్ జ్యోతిలక్ష్మి సినిమాకు. ట్రయిలర్ కు ముందే బిజినెస్ ప్రారంభించి, అడియో ఫంక్షన్ తో పాటే అది కూడా పూర్తి చేసేసాడని టాక్. 

నిర్మాణంలో తొలిసారి చార్మి భాగస్వామ్యం పంచుకున్న ఈ సినిమా బిజినెస్ పది కోట్లకు దగ్గరలో ముగిసిందని వినికిడి. ఇది కాక ఇంకా శాటిలైట్ వుండనే వుంది. మూడు నుంచి నాలుగు కోట్ల ప్రాంతంలో ఇది ఫైనల్ కావచ్చని తెలుస్తోంది

. సినిమా విడుదలయ్యేలోగా ఇది కూడా పూర్తయిపోతే, విడుదల కాకుడానే పధ్నాలుగు కోట్ల బిజినెస్ చేసినట్లు అవుతుంది.  సినిమా టాక్ ఎలా వున్నా బి సి సెంటర్లలో ఓపెనింగ్స్ బాగుంటాయని అంచనా వేస్తున్నారు. అందుకే బిజినెస్ బాగా అయినట్లు వినికిడి. ఇప్పటికే, జ్యోతిలక్ష్మి టైటిల్ సాంగ్ వీక్షకులను బాగానే అలరిస్తోంది.