బాస్ ఎవరు? ఎవరు? ఎవరు? ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణల్లో ఈ ప్రశ్నే వినిపిస్తోంది. రేవంత్ రెడ్డి మాటట్లో 'బాస్' అంటే చంద్రబాబు నాయుడే అని ప్రతిపక్షాలన్నీ దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే చిత్రసీమలోనూ ఓ బాస్ ఉన్నాడు. ఆయనే రాంగోపాల్ వర్మ అంటున్నాడు పూరి జగన్నాథ్.
వీళ్లిద్దరి గురుశిష్యుల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరిని బాలీవుడ్ తీసుకెళ్లింది వర్మనే. అంతేనా.. టెంపర్ సినిమా విడుదలవ్వకముందు నుంచీ ఆహా.. ఓహో అని పొగిడేశాడు. చిరంజీవి 150వ సినిమాకి నికార్సయిన దర్శకుడు పూరినే అని ముందే ఊహించి చెప్పాడు.
ఇప్పుడు పూరి గురువు రుణం తీర్చుకొంటున్నాడేమో, సీక్రెట్ సినిమాని మోసే పనిలో పడ్డాడు. 'చిత్రసీమలో బాస్ అంటే.. రాంగోపాల్ వర్మనే. ఆయన తీసిన సీక్రెట్ సినిమా చూశా.. అదిరిపోయింది' అంటూ ప్రచారం అప్పుడే మొదలెట్టేశాడు పూరి. మొత్తానికి భలే గురుశిష్యులు.