వెండితెరపై మళ్ళీ.. ఈసారేమవుతుందో.!

గతంలో ఓ టెలీ సీరియల్‌లో నటించిన రష్మి, వెండితెరపై పలు సినిమాల్లో నటించింది. అయినా ఆశించిన గుర్తింపు అయితే ఆమె దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం రష్మి అంటే, జబర్‌దస్త్‌.. జబర్‌దస్త్‌ అంటే రష్మి.. అనేంతలా జబర్‌దస్త్‌…

గతంలో ఓ టెలీ సీరియల్‌లో నటించిన రష్మి, వెండితెరపై పలు సినిమాల్లో నటించింది. అయినా ఆశించిన గుర్తింపు అయితే ఆమె దక్కించుకోలేకపోయింది. ప్రస్తుతం రష్మి అంటే, జబర్‌దస్త్‌.. జబర్‌దస్త్‌ అంటే రష్మి.. అనేంతలా జబర్‌దస్త్‌ కామెడీ షోతో రష్మి పాపులారిటీ సంపాదించుకున్న విషయం విదితమే. రష్మికన్నా ముందు ఆ షోకి యాంకరింగ్‌ చేసిన అనసూయ కూడా ఆ షోతోనే పాపులర్‌ అయ్యిందనుకోండి.. అది వేరే విషయం.

ఇక రష్మి విషయానికొస్తే తాజాగా ‘గుంటూర్‌ టాకీస్‌’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోందీ ముద్దుగుమ్మ. వెండితెరపై రష్మికి ఇది కొత్త ఇన్నింగ్స్‌ అనే అనుకోవాలి. సుశాంత్‌ హీరోగా నటించిన ‘కరెంట్‌’ సినిమాలో హీరోయిన్‌ స్నేహాఉల్లాల్‌ ఫ్రెండ్‌గా తెరపై చాలాసేపు కన్పించిన రష్మి, ఇకపై కూడా అలాంటి అవకాశాలొచ్చినా చేస్తానంటోంది.

అన్నట్టు, ‘గుంటూర్‌ టాకీస్‌’ సినిమాలో హాట్‌ బ్యూటీ శ్రద్ధాదాస్‌ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. శ్రద్ధాదాస్‌ హైలైట్‌ అవుతుందో, హీరోయిన్‌గా రష్మికి ఈ సినిమాతో మంచి సక్సెస్‌ దక్కుతుందో వేచి చూడాల్సిందే.