పవన్ కల్యాణ్‌ని ఎవరు పడితే వాళ్లు వాడేసుకొంటుంటారు. పవన్ పేరుతో కామెంట్ చేస్తే అదే హాట్ టాపిక్ అయిపోతుంది. ఇక పవన్ మనుషులు అనుకొన్నవాళ్లు మాట్లాడితే.. ఆ మాటకిక తిరుగుండదు. ఆ విషయాన్ని గ్రహించింది రేణూ దేశాయ్. అందుకే తానూ ఈమధ్య ఘాటైన కామెంట్లే చేస్తోంది.
ప్రత్యక్ష్యంగా పవన్‌ని ఏమనడం లేదుగానీ. పరోక్షంగా దెప్పిపొడుస్తోన్నట్టు అనిపిస్తోంది. పవన్ వల్లే నా జీవితం పాడైంది అనే మీనింగేదో ఆమె మాటల్లో ధ్వనిస్తోంది. ఆమధ్య పవన్‌కు పుట్టినా, నా పిల్లలు నా పేరుతోనే సమాజంలో గుర్తింపు తెచ్చుకొంటరంటూ ఓ కామెంట్ పెట్టింది ట్విట్టర్లో. దానిపై పవన్ అభిమానులు గోల గోల చేస్తున్నారు.
ఇంతలో మరోటి వదిలింది. సంప్రదాయాలకు తిలోదాలిచ్చి పెళ్లిళ్లమీద పెళ్లిళ్లు చేసుకొంటున్నవారిని ఏకిపడేసింది. ఓమగాడు పెళ్లయి, పిల్లల్ని కని ఆ తరవాత విడాకులిచ్చి మరో పెళ్లి చేసుకొన్నా ఇబ్బంది ఉండదని, అదే.. పిల్లలున్న స్త్రీ మాత్రం రెండోపెళ్లి చేసుకోలేదని చెబుతోంది రేణూ.