చరణ్ సినిమా వ్యవహారం ఆలు లేదు చూలు లేదు చందంగా వుంది. అత్యుత్సాహవంతులు 'మై నేమ్ ఈజ్ రాజు' అనే పేరు పుట్టించారు ముందు..ఇటీవల సుప్రీమ్, బ్రూస్లీ అనే పేర్లు కనిపెట్టారు. మరీ డబ్బింగ్ సినిమా టైటిళ్లలా వున్నాయన్నారు జనాలు.
కానీ అసలు విషయం ఏమిటంటే, ఇంతవరకు చరణ్ సినిమా టైటిల్ గురించి యూనిట్ అస్సలు ఆలోచించనే లేదట. ఏ పేరు గురించి అస్సలు డిస్కషనే జరగలేదంటున్నారు నిర్మాత డివివి దానయ్య. సరైన టైటిల్ కోసం ఆలోచిస్తున్నామని, అది దొరికితే ముందు మీడియాతోనే పంచుకుంటామని అంటున్నారాయన.
ఇప్పుడు దృష్టంతా సినిమాను ఎంత స్పీడ్ గా పూర్తి చేస్తామా అన్న దానిపైనే వుందన్నారు. అక్టోబర్ 10 న సినిమా విడుదల కన్ఫర్మ్ అని అంటున్నారు. సుప్రీమ్, బ్రూస్లీ, మైనేమ్ ఈజ్ రాజు ఇవన్నీ సోషల్ మీడియాలో పుట్టినవే తప్ప, తమ ఆలోచనలేవీ కావన్నారు. అందరికీ నచ్చే సూపర్ టైటిల్ పెడతామన్నారు.