మెగా హీరోలు చాలా లక్కీ

ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ అభిమానుల ఆదరణ పొందడమనేది అంత ఈజీ కాదు. ఈ విషయంలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు చాలా లక్కీ అనిపిస్తోంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది…

ఒక ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలందరూ అభిమానుల ఆదరణ పొందడమనేది అంత ఈజీ కాదు. ఈ విషయంలో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు చాలా లక్కీ అనిపిస్తోంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చినంత మంది సక్సెస్‌ఫుల్‌ హీరోలు ఈమధ్య మరే కుటుంబం నుంచి రాలేదు. చిరంజీవితో ఎలాంటి రిలేషన్‌ ఉన్నా కానీ టాలెంట్‌ ఉందనిపిస్తే ఆ హీరోని ఫాన్స్‌ నెత్తిన పెట్టుకుంటున్నారు. 

పవన్‌, అర్జున్‌, చరణ్‌ తర్వాత తాజాగా సాయి ధరమ్‌ తేజ్‌కి కూడా అన్ని చోట్ల ఫాన్స్‌ నుంచి బ్రహ్మాండమైన రెస్పాన్స్‌ వస్తోంది. అతని తొలి సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్‌ని బట్టే ఇతడికి ఫాన్స్‌ సపోర్ట్‌ ఉందని తేలింది. కానీ అదే విధమైన అదృష్టం మిగతా కుటుంబాలకి చెందిన హీరోలకి దక్కడం లేదు. 

నాగార్జున మేనల్లుళ్ళు సుమంత్‌, సుషాంత్‌ హీరోలుగా నిలదొక్కుకోవడానికి స్ట్రగుల్‌ అవుతున్నారు. నందమూరి కుటుంబం నుంచి ఈతరంలో జూ॥ ఎన్టీఆర్‌ మినహా ఇంకెవరూ క్లిక్‌ అవలేదు. ఈ ఫ్యామిలీతో రిలేషన్‌ ఉన్న నారా రోహిత్‌కి కూడా ఫాన్స్‌ సపోర్ట్‌ లేదు. కృష్ణ అల్లుడు సుధీర్‌ చిత్రాలకి కూడా మహేష్‌ ఫాన్స్‌ నుంచి స్పందన అంతగా కనిపించదు.