నారా రోహిత్ చిత్రానికి బాగానే ఉందనే టాక్ రావడం, కలెక్షన్లు లేకపోవడం మామూలైపోయింది. సోలో, ప్రతినిధి వంటివి కమర్షియల్‌గా యావరేజ్ అనిపించుకున్నాయే కానీ రోహిత్‌కి హిట్ ఇవ్వలేదు. ‘రౌడీ ఫెలో’ చిత్రానికి కూడా పబ్లిక్ నుంచి ఫర్వాలేదనే టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం చాలా డల్‌గా ఉన్నాయి.
తమ సినిమా కలెక్షన్లు అదరగొట్టేస్తున్నాయని ప్రెస్ నోట్లతో ఊదరగొట్టేస్తున్నారు కానీ… ప్రెస్ నోట్లు మినహా ఈ చిత్రానికి కరెన్సీ నోట్ల కళ మాత్రం కనిపించడం లేదు. ఈవారంలో ఇదే చెప్పుకోతగ్గ రిలీజ్ అయినా కానీ ‘రౌడీ ఫెలో’ ఓపెనింగ్స్ చాలా వీక్‌గా ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్లో డిజప్పాయింట్ చేసిన సినిమా పుంజుకోవడమన్నది ఈమధ్య కాలంలో జరగలేదు కనుక ‘రౌడీ ఫెలో’నుంచి ఇక అద్భుతాలు ఆశించక్కర్లేదు.
రోహిత్ స్క్రిప్ట్ సెలక్షన్ బాగున్నా కానీ ఎందుకో క్రౌడ్ పుల్లర్ కాలేకపోతున్నాడు. ఇప్పుడతను స్క్రిప్ట్ సెలక్షన్ మీదే కాకుండా ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే దానిపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఎలాగో తన ఫిజిక్ గురించి వచ్చిన నెగెటివ్ ఫీడ్‌బ్యాక్‌కి పాజిటివ్‌గా స్పందించి బరువు తగ్గుతానని అంటున్నాడు. అలాగే ప్రేక్షకుల్ని మొదటి రోజే థియేటర్లకి రాబట్టే కిటుకులేవో కూడా కనిపెట్టి తన తదుపరి చిత్రాలకి ఓపెనింగ్స్ తెచ్చుకోవడానికి చూడాలి.