ఇప్పుడిప్పుడే ఖాన్ త్రయం దృష్టిని ఆకర్షిస్తూ… బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయిపోవాలని కలలు కంటున్న ఇలియానాకి ‘హ్యాపీ ఎండింగ్’తో పిడి పడిపోయింది. సైఫ్ అలీ ఖాన్ సరసన ఇలియానా నటించిన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ ఏమాత్రం బాలేదు. పబ్లిసిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కాకపోయినా కానీ ఎందుకో దీనిని జనం పట్టించుకోలేదు.
దానికి తోడు రివ్యూస్ కూడా చాలా సాధారణంగా రావడంతో హ్యాపీ ఎండింగ్ పుంజుకునే ఛాన్సులు కనిపించడం లేదు. ఈ చిత్రం టోటల్ బిజినెస్ పాతిక, ముప్పయ్ కోట్లలోపే ముగిసిపోతుందని ట్రేడ్ వర్గాలంటున్నాయి. సైఫ్ సినిమాలకి వంద కోట్లు వసూలు చేసే సత్తా లేకపోయినా కానీ అతని స్టాండర్డ్‌కి కూడా ఇవి చాలా తక్కువ కలెక్షన్స్ అన్నమాట.
సైఫ్ కెరీర్‌లో ఇదో పెద్ద డిజాస్టర్ అని ట్రేడ్ అంటోంది. దీని తర్వాత ఇంతవరకు ఏ సినిమాకీ సైన్ చేయని ఇలియానా త్వరలో యష్‌రాజ్‌తో మూడు సినిమాలకి డీల్ కుదుర్చుకోనుందని వార్తలు వస్తున్నాయి. షారుక్‌తో ఒక చిత్రం చేస్తుందని కూడా రూమర్స్ ఉన్నాయి. రాంగ్ టైమ్‌లో తగిలిన ఈ డిజాస్టర్ ఆమె ఫ్యూచర్‌ని ఏ రేంజ్‌లో డ్యామేజ్ చేస్తుందో ఏంటో మరి.