మార్చి 5 నుంచి ఎన్టీఆర్ సినిమా షూటింగ్

టెంపర్ జోష్ తో వున్న ఎన్టీఆర్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల అయిదున ప్రారంభం కాబోతోంది.  రకుల్ ప్రీత్ సింగ్ తో ఎన్టీఆర్ జతకడుతున్నారు. సినిమాను బివిఎస్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.…

టెంపర్ జోష్ తో వున్న ఎన్టీఆర్ కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల అయిదున ప్రారంభం కాబోతోంది.  రకుల్ ప్రీత్ సింగ్ తో ఎన్టీఆర్ జతకడుతున్నారు. సినిమాను బివిఎస్ ఎస్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. అదుర్స్ తరువాత దేవీ సంగీతం అందిస్తున్నాడు ఎన్టీఆర్ సినిమాకు.

 సుక్కు తన ప్రయోగాలు పక్కన పెట్టి, ఎన్టీఆర్ కోసం మాంచి కమర్షియల్ స్క్రిప్ట్ రెడీ చేసాడని వినికిడి. పైగా ఎన్టీఆర్ ను డిఫరెంట్ గా చూపించాలనుకుంటున్నాడట.  ఎలాగైనా హిట్ కొట్టి,. బ్యాక్ టు బ్యాక్ హిట్ లు కొట్టాలని ఎన్టీఆర్, నేనొక్కడినే తెచ్చిన రిమార్క్ పోగొట్టుకోవాలని సుకుమార్ చూస్తున్నారు.