మూస సినిమాల జోలికి పోకుండా సరికొత్త ఆలోచనలతో అప్రోచ్ అయ్యే దర్శకులతో పని చేస్తున్న నిఖిల్ రెండు సినిమాలతో నిలకడ సాధించేసాడు. అతని తదుపరి చిత్రాలపై ఆసక్తి కలిగేట్టు చేయగలిగాడు. స్వామిరారా, కార్తికేయలాంటి విభిన్న చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు హ్యాట్రిక్‌పై కన్నేసాడు.
మార్చి 5న హోలీ సందర్భంగా రిలీజ్ అవుతోన్న నిఖిల్ తాజా చిత్రం ‘సూర్య వర్సెస్ సూర్య’ ప్రోమోస్ ప్రామిసింగ్‌గా అనిపిస్తున్నాయి. ఈ చిత్రం కాన్సెప్ట్ ఆల్రెడీ సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. నిఖిల్ చేతిలో మరో హిట్ మెటీరియల్ ఉందని మీడియా కూడా ముక్త కంఠంతో చెప్తోంది.
ఇంకో ఇంప్రెసివ్ ఫిలిం అనిపించుకున్నట్టయితే నిఖిల్‌కి హ్యాట్రిక్ రావడమే కాదు… యంగ్ హీరోస్లో తనకి చిన్నపాటి స్టార్ ఇమేజ్ వస్తుంది, మినిమం గ్యారెంటీ ట్యాగ్ కూడా దక్కుతుంది. తన రేంజ్ హీరోలు కథల్ని నమ్ముకుంటే సక్సెస్ కావచ్చునని నిఖిల్ నిరూపించడమే కాదు… వేరే వారికి కూడా దిశా నిర్దేశం చేస్తున్నాడు. కీపిటప్ నిఖిల్.