​బాహుబ‌లి ఆడియో ఫిక్స్‌

ప్రభాస్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. మే 31న బాహుబ‌లి పాట‌ల్ని విందామ‌ని, ప్రభాస్‌ని త‌నివితీరా చూద్దామ‌ని ఆశ‌లు పెట్టుకొన్న యంగ్ రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్‌, ఆ వేడుక వాయిదా ప‌డ‌డంతో హ‌ర్టయ్యారు. ఇప్పుడు వాళ్లకో తీపి క‌బురు.…

ప్రభాస్ అభిమానుల‌కు శుభ‌వార్త‌. మే 31న బాహుబ‌లి పాట‌ల్ని విందామ‌ని, ప్రభాస్‌ని త‌నివితీరా చూద్దామ‌ని ఆశ‌లు పెట్టుకొన్న యంగ్ రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్‌, ఆ వేడుక వాయిదా ప‌డ‌డంతో హ‌ర్టయ్యారు. ఇప్పుడు వాళ్లకో తీపి క‌బురు. బాహుబ‌లి ఆడియో డేట్‌, వేదిక ఫిక్సయ్యాయి. 

ఈనెల 10 ఆడియో వేడుక ఘ‌నంగా జ‌ర‌పాల‌ని బాహుబ‌లి టీమ్ నిర్ణయించుకొంది. ఈసారి వేదిక మారింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆడియో కార్యక్రమం జ‌ర‌పాల‌ని టీమ్ డిసైడ్ అయ్యింది. అక్కడైతే ఎంత‌మందొచ్చినా మేనేజ్ చేయొచ్చని ఈ నిర్ణయం తీసుకొన్నార‌ట‌. 

అంతేకాదు.. పాస్ లేనివాళ్లు లోప‌ల‌కు చొర‌బ‌డే అవ‌కాశాలూ లేవు. అందుకే ఫిల్మ్‌సిటీ సేఫ్ అని ఈ నిర్ణయం తీసుకొంది. ఇప్పటికే ఫిల్మ్‌సిటీలో ఏర్పాట్లు మొద‌లైపోయాయి. అక్కడ భారీ సెట్టింగులు వేస్తున్నార‌ట‌. ప్రభాస్ ఫ్యాన్స్‌.. రెడీ అయిపోండిక‌.