‘హుద్.. హుద్’.. హుర్రే

తెలివైన వాడికి అవకాశాలు తలుపుతట్టక్కరలేదు.. తనే అవకాశాలు సృష్టించుకుంటాడు. చంద్రబాబు ముమ్మాటికీ తెలివైన వాడు. అరనిమిషంలో ఆలోచించి, పావు నిమిషంలో అమలు చేసి, అయిదు సెకండ్లలో ఫలాలు అందేసుకుంటారు. అవతలి వారు దాని వైనం…

తెలివైన వాడికి అవకాశాలు తలుపుతట్టక్కరలేదు.. తనే అవకాశాలు సృష్టించుకుంటాడు. చంద్రబాబు ముమ్మాటికీ తెలివైన వాడు. అరనిమిషంలో ఆలోచించి, పావు నిమిషంలో అమలు చేసి, అయిదు సెకండ్లలో ఫలాలు అందేసుకుంటారు. అవతలి వారు దాని వైనం పసిగట్టేలోపే పనైపోతుంది. దటీజ్ బాబు.

విశాఖ మున్సిపల్ కార్పొరేషన్. రాష్ర్టంలోని కీలకమైన వ్యవస్థ. న్యవాంధ్ర రాజధాని విజయవాడ కన్నా కీలకమైనది. రాజకీయంగా ఈ పాలకవర్గం తెలుగుదేశానికి అత్యంత కీలకం. ఇప్పుడు ఇక్కడ వున్నట్లుండి వచ్చి పడిన ముప్పేమీ లేదు. ఎందుకంటే ఇటీవలి ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశమే ఎక్కువ శాసనసభ స్థానాలు గెల్చుకుంది. పార్లమెంటు స్థానాన్ని మిత్రపక్షమైన భాజపాకు గెలిపించి ఇచ్చింది. మరి వచ్చిన సమస్య ఏమీలేదు. అయినా చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టడం బాబుకు బాగా చాతనైన విద్య. అందుకే విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఆషామాషీగా తీసుకోకూడదనుకున్నారు.

Click Here For Great Andhra E-Paper

అలాంటి సమయంలో హుద్ హుద్ విపత్తు విరుచుకు పడింది. అందరూ తుపానును, అది సృష్టించిన పెనుగాలిని, మిగిల్చిన విపత్తునే చూసారు. కానీ బాబు అదే సమయంలో దానితో అందివచ్చిన అవకాశాన్ని చూసారు. అంతే ఇటు ముఖ్యమంత్రిగా మార్కులు, అటు ఎన్నికలు మెట్లు రెండూ సంపాదించాలనుకున్నారు. ఆ విధంగా ముందుకు పోయారు. 

తాయిలాలు

పార్టీ చేతి చమురు వదలకుండా ప్రజలకు ఎన్నికల తాయిలాలు అందించడం ఎలాగ అన్నది బాబుకు బాగా తెలుసు. గతంలో ఎన్నికల సమయంలో కిరోసిన్ కోటా కట్ చేసి, దానికి బదులుగా కేంద్రం గ్యాస్ కనెక్షన్లు అందిస్తానంది. వెంటనే బాబు ఇంటింటికీ గ్యాస్ కనెక్షన్ ఫ్రీ… ఫ్రీ.. ఫ్రీ.. అన్నారు. అటు కేంద్రం ఇచ్చిన కనెక్షన్లు ఇలా అందించి, తాను క్రెడిట్ కొట్టేసారు. ఇప్పడు కూడా అంతే.

ఉత్తరాంధ్రలోని పల్లపు ప్రాంతాల సంగతి పక్కన పెడితే హుద్ హద్ వల్ల వచ్చిన నష్టం భవనాలకు, చెట్లు చేమలకు, కరెంటు, టెలిఫోన్, ఇంటర్ నెట్ వ్యవస్థకు. అంతే కానీ విశాఖ పరిథిలోని ఇళ్లలోని సామాన్లు ఏవీ కొట్టుకుపోలేదు.. ప్రజల పప్పు, ఉప్పులు ఏవీ మునిగిపోలేదు. ప్రజల ఇళ్లలో సామాన్లు చెక్కు చెదరలేదు. కొద్ది రోజుల పాటు పాలు, నీళ్లు, కూరగాయలు మాత్రం అందలేదు. 

Click Here For Great Andhra E-Paper

కానీ బాబు ఏం చేసారు.. అడిగినా అడగకున్నా, కార్డు వుంటే చాలు, అది వైట్ కార్డా? పింక్ కార్డా అన్నది చూడకుండా బియ్యం, నూనె, పప్పు, ఉప్పు, కారం, ఇలా సమస్త సరుకులు అందించేసారు. అది మిడిల్ క్లాసా, అప్పర్ మిడిల్ క్లాసా అన్నది కూడ చూడలేదు. పైగా ఇక్కడే విశాఖ  మున్సిపల్ కార్పొరేషన్ పరిథిలో ఓ మాదిరిగా, మిగిలిన ప్రాంతాల్లో మరో మాదిరిగా. ఎందుకిదంతా.. జనం అంతా మా బాబే.. మా బాబే అనుకోవాలి. రాబోతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకోవాలి. ఇందుకోసం అయిన ఖర్చు 450 కోట్లు. ఈ పప్పు ఉప్పుల పంపిణీకే 450 కోట్ల వరకు ఖర్చు చేసేసారు. అంటే విశాఖ ఎన్నికను దృష్టిలో వుంచుకుని ప్రభుత్వం చేత చేయించిన ఖర్చు. 

చాలా మంది ఎగువ మధ్యతరగతి కుటుంబాలు, ఉన్నతకుటుంబాలు తమ తమ రేషన్ కార్డులను ఎప్పడో మూలన పెట్టేసారు. వాటిని మహా అయితే అడ్రస్ ప్రూఫ్ లుగా వాడడం ప్రారంభించారు. దాంతో డీలర్ల పంట కూడా పండింది. లిస్ట్‌లో టిక్ పెట్టేసుకోవడం, సామాను పెరటిదోవంట బజారుకు తరలించేసుకోవడం. దీంతో ఇంతటి మహత్తర అవకాశం కల్పించిన బాబు… ఇప్పుడు మాబాబే.. అని అనుకోవాలి.

విశాఖ ఎందుకు కీలకం

రాష్ర్టంలోని రెండు కీలక నగరాల్లో ఒకటి విశాఖ. విజయవాడ రాజధానికి దగ్గర కాబట్టి ఇప్పుడు కీలకం కావాలి కానీ, లేదంటే విశాఖ ఎప్పుడో కీలకం. ఈ వైనం గుర్తించే చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి అండగా వుండే సామాజిక వర్గం ఎప్పుడో విశాఖను తమ అడ్డాగా చేసుకుంది. ఇక్కడ రాజకీయ పదవులు నాలుగింట మూడు వంతులు తమ స్వంతం చేసుకుంది. వ్యాపారాలు సరేసరి. రియల్ ఎస్టేట్ చెప్పనక్కరలేదు. కాంట్రాక్టులు కూడా. దీనికి పార్టీల హద్దులు, సరిహద్దులు ఏవీ అడ్డం కావు. మనోడా కాదా అన్నదే అక్కడి రాజకీయం. విజయవాడలో కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గంతో పోటీ వుంది. ఇక్కడ అదీ లేదు. విశాఖలో బలంగా వుండే యాదవ, మత్సకార వర్గాలు అరకొర పదవులతో తృప్తి చెందిపోవడం ఎప్పుడో అలవాటు చేసుకున్నాయి. 

అందువల్ల విశాఖ అన్నది కమ్మసామాజికవర్గ రాజకీయ అడ్డాగా మారింది. ఇఫ్పుడు ఆ పట్టు మరింత నిలబెట్టుకోవాలన్నా, భయంకరమైన రియల్ ఎస్టేట్, విలువైన భూములు వున్న ప్రాంతంపై తమ పట్టు నిలబెట్టుకొవాలనా, రాబోయే పరిశ్రమలు, రాయతీలు ఇతరత్రా వ్యవహారాలు సజావుగా జరిపించుకోవాలన్నా, కార్పొరేషన్ తమ చేతిలో వుండడం చాలా అవసరం.

Click Here For Great Andhra E-Paper

అందుకే ఇప్పుడు బాబు తరచు విశాఖ జపం చేస్తున్నారు. వీలయినంతవరకు విశాఖ వాసులను ఉబ్బేసే పనిలో పడ్డారు. వారు చాలా ధైర్యవంతులు.. హద్ హుద్ ను ధైర్యంగా ఎదుర్కొన్నారు వంటి పదాలతో వారి మనసు చూరగొంటున్నారు. 

ఇదీ సంగతి. చంద్రబాబు ఏ విధంగా అవకాశాలు సృష్టించుకుంటారు.. ఆపదలో, విపత్తులో కూడా అవకాశాలను ఏ విధంగా అందిపుచ్చుకుంటారన్నదానికి విశాఖ-హుద్ హుద్-కార్పొరేషన్ ఎన్నిక ఓ తార్కాణం.