బాలీవుడ్‌లో స్టైలిస్ట్ స్టార్ ఎవరంటే చిన్నా పెద్దా తేడాలేకుండా ప్రతీ డిజైనర్ ఓటేసే పేరు సోనమ్ కపూర్. మొన్నటి బాలీవుడ్ హీరో అనిల్‌కపూర్ కుమార్తె అయిన ఈ స్లిమ్ బ్యూటీ… తను ప్రస్తుతం ఎవరితో డేటింగ్ చేస్తుందో చెప్పనంటోంది. అది పూర్తిగా తన వ్యక్తిగతం అంటోందీ బాలీవుడ్ హీరోయిన్.
షాంపూ ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం బ్రేకప్‌లపై రూపొందిన ఒక వీడియోను ఆమె లాంచ్ చేసింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఇద్దరి మధ్య అనుబంధం బ్రేకప్ అవడం ఎలా మంచిది ఎందుకు మంచిది కాదు అనేవి తాను చెప్పగలను గాని తన వ్యక్తిగత విషయాలు ఎవరితోనూ పంచుకోలేనంది. ఇది ఇప్పుడు కాదని, తాను సినీరంగంలోకి ప్రవేశించిన కొత్తలోనే తీసుకున్న నిర్ణయమని దానికి ఇప్పటి దాకా కట్టుబడి ఉన్నానని ఇకపై కూడా అలాగే ఉంటానని స్పష్టం చేసింది.
తన జీవితంలో ఉన్న వ్యక్తి, అతడితో అనుబంధం గురించి పత్రికల్లో రావడం తనకు ఇష్టం లేదంది. తన రిలేషన్స్ గురంచిన విషయాలు జనం మాట్లాడుకోవడం వల్ల తన వర్క్ మీద కాన్సన్‌ట్రేషన్ దెబ్బతింటుందని అభిప్రాయపడింది.
మంచిదే. బయటకు ఇలాంటి విషయాలు చెప్పకపోవడం చాలా మంచిది. రణబీర్‌కపూర్, పునీత్ మల్హోత్రా వంటి వారితో సోనమ్ అనుబంధం ఏమిటి? అనేదానికి సమాధానం ఎవరికీ అవసరం లేదు. అయితే ఇప్పుడీ అమ్మడి మాటలతో కొందరికి వస్తున్న సందేహం.. మన వర్క్ మీద కాన్సన్ ట్రేషన్ దెబ్బ తినకూడదంటే… పరిధులు దాటి ఎఫైర్స్ పెట్టుకోకుండా ఉండడం అవసరమా? వాటి గురించి మాట్లాడకుండా ఉండడం అవసరమా?