సిద్దార్థ కాస్త గ్యాప్ తరువాత చేస్తున్న సినిమా చిక్కడు దొరకడు. ఇది తమిళ డబ్బింగ్. ఈ సినిమా ఆడియో ఇవాళ విడుదలైంది. పిజ్జా సినిమాతో తన సత్తా నిరూపించుకున్న కార్తీక్ సుబ్బరాజ్ దీనికి దర్శకుడు. గజరాజు సినిమాతో అందాలు వెదజల్లిన లక్ష్మీ మీనన్ కథానాయిక. సినిమా ఆడియోతో పాటు విడుదలైన టీజర్, ట్రయిలర్ చూస్తే మాత్రం నాటు తమిళ సినిమా ఛాయలు గోచరిస్తున్నాయి.
కార్తీక్ వైవిధ్యమైన డైరక్టర్..మంచి స్క్రిప్ట్ రైటర్. ఈ సినిమా మంచి సినిమా అని శశాంక్ వెన్నెల కంటి తో సహా పలువురు చెప్పారు. బాగానేవుంది. కానీ ఎంత మంచి సినిమా అయినా తమిళవాసన కొడితే తెలుగు జనం ఏ మేరకు చూస్తారన్నది అనుమానం. సరే, కమర్షియల్ గా ఎలా వున్నా, సినిమాకు ఎత్తుకున్న పాయింట్, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కు టాలెంట్ కలిసి, ఓ మంచి సినిమా అయితే తయారవుతోందని మాత్రం అనుకోవచ్చు.
ఇక్కడ అసలు ట్విస్టు ఇంకోటుంది. చిక్కడు దొరకడు తమిళ వెర్షన్ జిగర్ తాండా ట్రయిలర్ కు , తెలుగు చిక్కడు దోరకడు ట్రయిలర్ కు చాలా తేడావుంది. తెలుగు ట్రయిలర్ తమిళ వాసనతో వుంటే తమిళ ట్రయిలర్ చూడ్డానికి ఆసక్తి కలిగించేలా వుంది. అదేమిటో చిత్రం.