అక్కినేని కాదు..యార్లగడ్డ సుమంత్

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా అదే ఇంటిపేరుతో వుంటారనుకుందేమో ఏంకర్ సుమ..అఖిల్ అడియో ఫంక్షన్ కు వచ్చిన సుమంత్ ను పట్టుకుని, పదే పదే అక్కినేని అఖిల్ అంటూ ప్రస్తావించింది. నిజానికి సుమంత్…

అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలంతా అదే ఇంటిపేరుతో వుంటారనుకుందేమో ఏంకర్ సుమ..అఖిల్ అడియో ఫంక్షన్ కు వచ్చిన సుమంత్ ను పట్టుకుని, పదే పదే అక్కినేని అఖిల్ అంటూ ప్రస్తావించింది. నిజానికి సుమంత్ నాగార్జునకు మేనల్లుడు. ఆయన ఇంటిపేరు యార్లగడ్డ. సాధారణంగా సుమ చాలా పెర్ ఫెక్ట్ గా ఏంకరింగ్ చేస్తుంది. కానీ ఎందుకో ఇక్కడ చిన్నమి స్టేక్..

అమ్మాయిల గురించి నాన్ననే

అమ్మాయిల గురించి సలహా అడగాల్సివస్తే నాన్ననే అడుగుతా అని సమాధానం చెప్పి, నాగ చైతన్య ఆడిటోరియం ను నవ్వుల్లో ముంచెత్తాడు. అఖిల్ కు సలహాలిస్తారా అని అడిగితే, తానే సలహాలు అడుగుతాను అని సమాధానం ఇచ్చాడు చై. ఏ విషయంలో అమ్మాయిల విషయంలోనా అని మళ్లీ అడిగితే, అమ్మాయిల గురించే అయితే అఖిల్ ను కాదు నాన్ననే అడుగుతా అని టక్కున సమాధానం చెప్పి, యాంకర్ నోట మాట రాకుండా చేసేసాడు చైతన్య.