అడియో ఫంక్షన్ డేటీ, రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాడు బ్రూస్ లీ. ఒక పక్క కొద్దిగా కీలక షూటింగ్ పార్టీ బకాయి వుంది. అయితే అది అయిన తరువాత ప్రచారం ప్రారంభిస్తే, టైమ్ సరిపోదని రామ్ చరణ్ భావిస్తున్నాడట. అందుకే ఇప్పటి నుంచే పబ్లిసిటీ వ్యవహారాలు ప్రారంభించమని నిర్మాత దానయ్యకు చెప్పినట్లు వినికిడి.
అందుకే కొత్త డిజైన్లు విడుదల చేయడం వంటి కార్యక్రమాలు ప్రారంభించారు. దసరా సీజన్ లో చాలా గట్టి పోటీ వుంది. ఏ సినిమా ఎలా వుంటుదన్నది అప్పుడే తెలియదు. ట్రయిలర్లు, టీజర్లు, ఈ వ్యవహారాలు అన్నీ ఓకె. జనాలు దేనికి ఓకె అంటారో అన్నది విడుదల వరకు తెలియదు.
శివమ్, రుద్రమదేవి, పులి,అఖిల్, షేర్ అటు ఇటు వున్నాయి బ్రూస్ లీ కి. సినిమా హిట్ గురించి కాదు సమస్య. థియేటర్లు, కలెక్షన్లు, భారీ పెట్టుబడి,రాబడులు ఇవన్నీ కీలకం. ముందు వున్నవి అన్నీ పెద్ద సినిమాలే. హిట్ అయినా కూడా థియేటర్లలోంచి సినిమాలు తీసేయడానికి వీలువుండడం కష్టం. పైగా వెనకు కూడా పెద్ద సినిమాలు వున్నాయి. వాటికి థియేటర్లు కావాలి. అందువల్ల వీలయినంత మొత్తం తొలివారంలో రాబట్టాలి. అందుకే సినిమాకు మాగ్జిమమ్ హైప్ తీసుకురావడానికి ఇప్పటి నుంచే పబ్లిసిటీ ప్లాన్ చేస్తున్నారట.
ఇకపై తరచు స్టిల్స్, మేకింగ్ విడియోలు, ఇతరత్రా ప్రచార సామగ్రి మీడియాకు అందుబాటులోకి తెస్తారని వినికిడి. అంటే ఓ పక్క సినిమా రెడీ అవుతుంటేనే ప్రచారం స్లయిమంటేనియస్ గా నడుస్తుందన్నమాట.