కరణ్ మల్హోత్రా…పేరే కొత్తగా విన్నట్టుంది కదూ! కానీ…రూపం మాత్రం సుపరిచితమే. కౌంటర్లో టికెట్ కొని లైట్లారిన థియేటర్లోకి వెళ్లి సినిమాల్ని చూసే ప్రేక్షకుడికి ఆమెని ప్రత్యేకించి పరిచయం చేయనవసరం లేదేమో? సెవన్టీఎంఎం స్క్రీనంతా దేహాన్ని పరిచేస్తూ వీక్షకుల ‘సౌందర్య దాహాన్ని’ తీర్చే అభిసారిక…బాలీవుడ్ తారక ఆమె.
నిజానికి, ఆమె సినీ అరంగేట్రమే ఓ సంచలనం. తర్వాత్తర్వాత…ఆమె ప్రతిచిత్రం ఇంచుమించు వివాదాస్పదం. సినిమాల్లో ‘హాట్‌హాట్’గా, ‘వార్తల్లో వ్యక్తి’గా ప్రముఖంగా ఆమె కనిపిస్తూనే ఉంది. తన కదలికల్తో జనాల్ని కదిలిస్తూనే ఉంది. అంతగా ప్రాచుర్యం పొందిన ఆమెని ‘కరణ్ మల్హోత్రా’గా ఎవరూ గుర్తించరు. కారణం… అయిదక్షరాల స్క్రీన్‌నేమ్‌తోనే ఆమె అశేషప్రేక్షకలోకాన్నీ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ పేరు వింటే చాలు…యువ హృదయాలు కరెంట్‌షాక్‌కి గురైనట్లు విలవిల్లాడుతాయి. ఎస్..ఆమె ఒకప్పటి ‘నీలితార’. ఇప్పటి బాలీవుడ్ నాయిక సన్నీలియోన్. ఎప్పుడూ ఏదోరకంగా వార్తల్లో ఉండే సన్నీలియోన్ తాజాగా…మరోసారి మీడియాకెక్కింది. అదీ…సరికొత్త వర్కవుట్ల సంచలన డీవీడీతో. హైటెంపో మ్యూజిక్…పెప్పీనంబర్‌తో రిలీజైన సన్నీలియోన్ వర్కవుట్ల డీవీడీయే ఇప్పుడు తాజా సంచలనం. దీనికి సంబంధించిన న్యూసే ఇంటర్‌నెట్‌లో ఇప్పుడు హల్‌చల్ చేస్తూ అత్యధిక ‘క్లిక్’లను నమోదు చేస్తోంది…ఒకప్పడు ‘జిస్మ్‌టూ’లా.
వర్కవుట్ సాంగ్ స్పెషల్ అట్రాక్షన్
ఈ తాజా డీవీడీకి సన్నీలియోన్ ప్రధాన ఆకర్షణ కాగా, వర్కవుట్ సాంగ్ ప్రత్యేకాకర్షణ. ‘సన్నీ హై సూపర్…సూపర్! ఫిట్ హై నీచే సే ఊపర్!! వన్నాబీ లైక్ హర్!! స్ట్రెచ్ యువర్‌సెల్ఫ్ అండ్ మూవ్ యువర్ బాడీ!!’’ అనే పల్లవితో సాగే ఈ సాంగ్ ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో ప్రతిధ్వనిస్తోంది. ‘హిప్ రొటేషన్…ట్విస్టింగ్…జంపింగ్…జావింగ్…పంచింగ్…ఎవ్విరీ మార్నింగ్ అండ్ ఈవినింగ్’’ ప్రతిఒక్కరికీ అవసరమనే సందేశంతో రూపొందిన ఈ సాంగ్‌పట్ల యువత విశేషంగా ఆకర్షితమవుతోంది. ‘‘సన్‌లీ..సన్‌లీ తూ ఆజా…ఫిట్‌నెస్ కీ దునియా మే ఆ జా!! అనే ఆహ్వానం పలుకుతున్న ఈ గీతం…‘‘మేక్ యువర్ మార్నింగ్ హాట్ అండ్ సన్నీ..బాత్ మేరీ మానో మై హనీ…ఫర్ సెక్సీబాడీ మై హనీ!!’’ అంటూ సాగుతుంది. ‘‘ఫిట్‌నెస్ ె డెస్టినేషన్…మైండ్ మే ె కాంసంట్రేషన్…ఎక్సర్‌సైజ్‌కీ ఇస్ జర్నీ మే మజా బహుత్ హై!! బాడీమే మాగ్నటిజమ్! జిసాె్క ఫాసినేషన్!! ఫిట్ ెకే సబ్‌కీ నజరోంమే స్టార్‌వో బన్ జాయే!! అరె..మోడల్ జైసీ బాడీ బనాకీ స్టయిలిష్ జారే!! సబ్‌కీ చుట్టీ కార్‌జారే!! అంటూ నయాగారా జలపాతంలా ెరెత్తే వాద్యనేపధ్యంలో ఈ గీతం ఆద్యంతం సాగుతుంది. మధ్యమధ్యలో ఎక్సర్‌సైజ్‌కి సంబంధించిన సలహాలు, సూచనలు కూడా పాట రూపంలోనే వినిపిస్తాయి.
వర్కవుట్‌లో హాట్‌హాట్‌గా
సన్నీలియోన్..ఆపేరుకున్న ప్రత్యేకత అంతాఇంతా కాదు. ఆమె మాజీ పోర్న్‌స్టార్. ‘అడల్ట్ స్టార’నే ముద్రతో బాలీవుడ్‌కి ఏతెంచిన సన్నీలియోన్ ‘హాట్ హాట్’ చిత్రాల్తోనే తనదైన ముద్ర వేసుకుంది. అప్పుడెప్పుడో 2003లో రిలీజైన ‘జిస్మ్’కి సీక్వెల్‌గా పూజాభట్ దర్శకత్వంలో ‘జిస్మ్‌టూ’ సినిమాతో ప్రేక్షకలోకాన్ని విష్ చేసిన సన్నీలియోన్ ఆ తర్వాత వివాదాల్తో సహవాసం చేస్తూనే కెరీర్‌ను ముందుకు నడిపిస్తోంది. ‘జిస్మ్..’ అంటే ‘దేహం’ అని అర్ధం. దేహాల సందేహాల్ని తీర్చేందుకుగాను ‘జిస్మ్’ రూపొందగా…‘బిగ్‌బాస్’ రియాల్టీషో ద్వారా ఇండియన్స్‌కి పరిచితమైన సన్నీలియోన్‌ని ‘జిస్మ్‌టూ’ ద్వారా బాలీవుడ్‌కి పరిచయమైన నేపధ్యంలో రిలీజ్ చేసిన ఫస్ట్‌లుక్ సెన్సేషన్ క్రియేట్ చేసింది. సన్నీలియోన్ నగ్నదేహంపై పల్చటి తెల్ల చీర కప్పి ఆ చిత్రం ఫస్ట్‌లుక్ విడుదల చేసారు. దాంతోపాటు పూజాభట్ దర్శకత్వం చేయడంతో ఆ సినిమాకి ఎక్కడలేని క్రేజ్ వచ్చింది. అంతేకాదు…! ‘బిగ్‌బాస్’ రియాల్టీషోలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఇండియా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను ‘బిగ్‌బాస్’ షోలో పాల్గొన్న తర్వాతనే భారతీయులు లైంగికత గురించి బాహాటంగా మాట్లాడుకునే స్వేచ్ఛను పొందారన్నదే ఆ వ్యాఖ్యల సారాంశం. నీలితారగా పనిచేసానని..ఇప్పుడు బాలీవుడ్‌లో స్టార్‌గా ఎదగాలనే ఆకాంక్షతోనే అహర్నిశలూ పనిచేస్తున్నానని సమయం దొరికినప్పుడల్లా ఆమె ప్రకటిస్తోంది. అంతేనా! పోర్న్‌స్టార్లంటే ప్రాస్టిట్యూట్‌లు కారంటూ తనదైన వాదన వినిపిస్తోంది. ఆ వాదన ఖండించేవాళ్లే ఎక్కువనేవాళ్లూ మనలోనే ఉన్నారు.
సన్నీలియోన్ భారత్‌లో ఉండొద్దు
అడల్ట్ కంటెంట్ అధికంగా ఉన్న సినిమాల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనదైన స్థానాన్ని సముపార్జించుకోవడానికి ఆమె చేస్తున్న ప్రయత్నం అంతాఇంతా కాదు. అదే సందర్భంలో చేస్తున్న సినిమాలు, అంగీకరించిన యాడ్స్ ద్వారా ఎప్పటికప్పుడు సన్నీలియోన్ పీకల్లోతు వివాదాల్లో కూరుకుపోతూనే ఉంది. భారతీయ మూలాలున్న సన్నీలియోన్‌ని భారత్ నుంచి తరిమేస్తే తప్ప మంచి జరగదంటూ ఆమెకి వ్యతిరేకంగా ఉద్యమస్థాయిలో గొంతెత్తేవాళ్లు బాలీవుడ్‌లో పుష్కలంగానే ఉన్నారు. ఆమెతో పోలిస్తే చిరాకు పడే తారలకూ కొదవ లేదు. రాఖీసావంత్‌లాంటి వాళ్లు సన్నీలియోన్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఆమె సినిమాలకు సెన్సార్ కత్తెర పడుతూనే ఉంది. యాడ్స్‌కి సంబంధించి ఆమెకు సమన్లు జారీ అవుతూనే ఉన్నాయి. కండోమ్ ఉత్పత్తికి సంబంధించి టీవీ కమర్షియల్‌లో కనిపించినందుకుగాను రక్షజ్యోతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్ధ సన్నీలియోన్‌పై కేసు పెట్టింది. దాంతో, ఆమధ్య లుధియానా పోలీసులు ఆమెకి సమన్లు జారీ చేసి హడావుడి చేసారు. ఈ సందర్భంగానే సన్నీలియోన్‌పై కొంతమంది బాలీవుడ్‌స్టార్స్ విమర్శనాస్త్రాలు గుప్పిస్తూ…యువతను చెడిపేస్తుందంటూ పేర్కొన్నారు. అంతేకాదు…బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ముంబైలో అద్దెకు సన్నీలియోన్‌కి ఇల్లు కూడా దొరకలేదు.
సన్నీపై షార్ట్‌ఫిల్మ్?
నీలితారగా, సినీతారగా…చీకటివెలుగుల క్రీనీడల్తో సయ్యాటలాడిన సన్నీలియోన్ తన జీవితం ‘తెరిచిన పుస్తకమ’ంటూ అభివర్ణిస్తోంది. దిలీప్‌మెహతా అనే డైరక్టర్ సన్నీలియోన్ నిజజీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ షార్ట్‌ఫిల్మ్ రూపొందించేందుకు సన్నాహాలు బాలీవుడ్‌లో వార్త హల్‌చల్ చేస్తోంది. ఈ వార్తను సన్నీలియోన్ భర్త డేనియల్ వేబర్ కూడా ధృవీకరించారు. వచ్చే ఏడాది ఈ డాక్యుమెంటరీని ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించేందుకుగాను రూపొందిస్తున్నట్లు ఆయన చెప్తున్నారు. ఓవైపు నిజజీవితం ఆధారంగా షార్ట్‌ఫిల్మ్ నిర్మాణ ప్రయత్నాల నేపధ్యంలో…అంతకు ముందుగానే ‘వర్కవ్లు డీవీడీ’తో ముందుకొచ్చింది సన్నీలియోన్.
ప్రియాంక, హృతిక్‌లకు ప్రశంస
వర్కవుట్ డీవీడీ ఆవిష్కరణ సందర్భంగా సన్నీలియోన్ బాలీవుడ్ నాయికానాయకులు ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్‌లను ప్రశంసల్తో ముంచెత్తింది. ప్రియాంక చోప్రాది ‘వెల్‌షేప్‌డ్ బాడీ’ అని మెచ్చుకుంది. అదే సమయంలో హృతిక్ రోషన్‌ది ‘పర్‌ఫెక్ట్ స్కల్‌ప్టెడ్ బాడీ’గా అభివర్ణించింది. కెమెరా ముందు అందంగా కనిపించాలంటే ‘వర్కవుట్ల’ అవసరం ఎంతైనా ఉందని సెలవిస్తున్న సన్నీలియోన్ అందుకోసం తనవంతు ప్రేరణగా వర్కవుట్ డీవీడిని రూపొందించింది.
‘హృదయాల్నే కాదు…ఉదయాల్ని సైతం వేడెక్కిస్తా’నంటున్న సన్నీలియోన్ వర్కవుట్ డీవీడీల్లో హాట్‌గానే ఉంది. ఔను…‘సూపర్‌హాట్ సన్నీ మార్నింగ్స్’ మరి. గతంలో ‘నీలితార’ అనే ముద్రను చెరిపేసుకుని మెయిన్‌స్రీమ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తానూ భాగమేనంటూ ప్రూవ్ చేసుకోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తున్న ఈ తార…వర్కవుట్ డీవీడీద్వారా ఏ సందేశం ఇవ్వదలచుకుందీ అనే ప్రశ్నకు మాత్రం …తన క్రేజూ, ఇమేజ్‌నీ బిజినెస్ చేసుకోవడానికేననే అభిప్రాయం కూడా వెల్లువెత్తుతోంది. గతంలో శిల్పాశెట్టి కూడా యోగ పేరుతో ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఇప్పుడు ఫాంలో ఉన్న సన్నీలియోన్ వంతు.
పి.వి.డి.ఎస్.ప్రకాష్