మైండ్‌ బ్లాక్‌ చేస్తున్న గోవిందుడు

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకి అసలు క్రేజ్‌ లేదని, కృష్ణవంశీ రీసెంట్‌ ట్రాక్‌ రికార్డ్‌ వల్ల దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని, అభిమానులకి కూడా అంచనాలు లేవని రకరకాలుగా రాసి పారేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి…

‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాకి అసలు క్రేజ్‌ లేదని, కృష్ణవంశీ రీసెంట్‌ ట్రాక్‌ రికార్డ్‌ వల్ల దీనిని ఎవరూ పట్టించుకోవడం లేదని, అభిమానులకి కూడా అంచనాలు లేవని రకరకాలుగా రాసి పారేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి ఏమి ఉన్నా లేకపోయినా రామ్‌ చరణ్‌ స్టార్‌డమ్‌ కొండంత బలంగా నిలిచింది. రామ్‌ చరణ్‌కి ఉన్న మాస్‌ ఫాలోయింగ్‌ దృష్ట్యా ఈ చిత్రాన్ని భారీ రేట్లకి కొనుగోలు చేస్తున్నారు బయ్యర్లు.

గోవిందుడు అందరివాడేలే చిత్రానికి పెద్దగా బిజినెస్‌ ఆఫర్స్‌ రావేమో అనుకున్నారు. కానీ అనూహ్యంగా దీనికి సీడెడ్‌లో ఎనిమిది కోట్ల పది లక్షలకి బిజినెస్‌ క్లోజ్‌ అయింది. నెల్లూరులో అయితే కనీ వినీ ఎరుగని విధంగా రెండు కోట్ల పది లక్షలకి ఈ చిత్రాన్ని కొనుగోలు చేసారు. బయ్యర్లకి కేవలం ఒక టీజర్‌ చూపించి నిర్మాత బండ్ల గణేష్‌ బిజినెస్‌ క్లోజ్‌ చేసాడని టాక్‌. 

గోవిందుడు అందరివాడేలే ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ అయినప్పుడు, అది మొదలైనప్పుడు దీనిపై ఎలాంటి అంచనాలున్నా కానీ షూటింగ్‌ ముందుకు సాగే కొద్దీ దీనిపై ఇంప్రెషన్‌ మారుతోంది. నెమ్మదిగా ఈ చిత్రం క్రేజీ ప్రాజెక్ట్‌గా షేప్‌ తీసుకుంటోంది.