శేఖర్ కమ్ముల..మాంచి ఇంటలెక్చ్యువల్ డైరక్టర్..ప్యూర్ సినిమా లవర్..అండ్ సింపుల్ పర్సన్. కానీ చేతిలో సినిమా లేదు. ఇప్పటికీ జనం లీడర్, గోదావరి అంటూ పలవరిస్తూనే వున్నారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తీసినా, అనామిక చేసినా ఫలితం రాలేదు. సరైన సినిమా పట్టాలని చూస్తున్నాడు.
కొద్ది రోజుల క్రితం మహేష్ కు ఓ లైన్ చెప్పాడని, ఆయన ఓకే చేస్తే సినిమా వుంటుందని వార్తలు వినవచ్చాయి. తరువాత మరి సందడి లేదు. కానీ ఇప్పుడు టాలీవుడ్ లేటెస్ట్ బజ్ ఏమిటంటే, శేఖర్ కమ్ముల ఈ మధ్య తరచుగా మహేష్ తో టచ్ లో వుంటున్నాడని.
రామోజీ ఫిల్మ్ సిటీ బ్రహ్మోత్సవం సెట్ కూ వెళ్లి వచ్చాడని. ఎప్పటికప్పుడు స్క్రిప్ట్ అప్ డేట్స్ ఇస్తున్నట్లా? లేదా మహేష్ తో సినిమా ఓకె అయి, సైలెంట్ గా ప్రీ ప్రొడక్షన్ పనులు చూస్తున్నాడా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అయితే శేఖర్ కమ్ముల ఎవరితోనూ పెద్దగా ఇంట్రాక్ట్ కారు..ఎక్కువ మాట్లాడరు. అందుకనే కావచ్చు ఏ విషయం బయటకు రావడం లేదు. మహేష్ ను కలుస్తున్న సంగతి తప్ప.