‘కిక్‌’ మీద చాలా ఆశలే పెట్టుకుంది

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకోవడానికి దగ్గర్లో వున్నానంటోంది. తన తాజా చిత్రం ‘కిక్‌’ విడుదలైతే తన దశ మారిపోతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. తెలుగులో…

శ్రీలంక బ్యూటీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌, బాలీవుడ్‌లో హీరోయిన్‌గా తిరుగులేని ఇమేజ్‌ సొంతం చేసుకోవడానికి దగ్గర్లో వున్నానంటోంది. తన తాజా చిత్రం ‘కిక్‌’ విడుదలైతే తన దశ మారిపోతుందని కాన్ఫిడెంట్‌గా చెబుతోంది జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌. తెలుగులో రవితేజ, ఇలియానా జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘కిక్‌’ సినిమాని సల్మాన్‌ఖాన్‌ హీరోగా హిందీలో సాజిద్‌ నడియడ్‌వాలా తెరకెక్కించిన విషయం విదితమే.

విడుదలకు సిద్ధమైన ‘కిక్‌’ సినిమాని హాలీవుడ్‌ రేంజ్‌ టెక్నికల్‌ వాల్యూస్‌తో రూపొందించారు. తెలుగు ‘కిక్‌’తో పోల్చితే, హిందీ కిక్‌లో యాక్షన్‌ ఓ రేంజ్‌లో వుంటుందట. ఇందులో హీరోయిన్‌ పాత్ర కూడా చాలా ఎక్సయిటింగ్‌గా తీర్చిదిద్దారట. ఈ విషయాలన్నీ జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌ చెబుతోంది. తన సినిమా ప్రమోషన్‌లో ఏ హీరోయిన్‌ అయినా ఇలానే మాట్లాడుతుందనుకోండి.. అది వేరే విషయం.

అదలా వుంచితే, సల్మాన్‌ఖాన్‌ కూడా ఈ సినిమాపై భారీ అంచనాలతో వున్నాడు. సినిమా బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తుందని సల్మాన్‌ఖాన్‌ ధీమాతో వున్నాడు. మొత్తమ్మీద, అటు జాక్వెలైన్‌, ఇటు సల్మాన్‌.. ‘కిక్‌’ మీద పెట్టుకున్న ఆశలేమవుతాయో వేచి చూడాల్సిందే.