పవన్‌కళ్యాణ్‌ జాగ్రత్త పడుతున్నాడు

పవన్‌కళ్యాణ్‌ ఈపాటికే ‘గోపాల గోపాల’ షూటింగ్‌లో పాల్గొని, తన వర్క్‌ సగానికి పైగా పూర్తి చేసేసి ఉండాలి. కానీ ఇంతవరకు పవన్‌ ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో అడుగు పెట్టనేలేదు. ఇంకా ఈ చిత్రంలో…

పవన్‌కళ్యాణ్‌ ఈపాటికే ‘గోపాల గోపాల’ షూటింగ్‌లో పాల్గొని, తన వర్క్‌ సగానికి పైగా పూర్తి చేసేసి ఉండాలి. కానీ ఇంతవరకు పవన్‌ ఈ సినిమా షూటింగ్‌ స్పాట్‌లో అడుగు పెట్టనేలేదు. ఇంకా ఈ చిత్రంలో తన గెటప్‌ విషయంలో కూడా పవన్‌కి ఒక క్లారిటీ రాలేదు. ఇప్పటికీ తన పొలిటికల్‌ క్యాంపైన్‌ లుక్‌తోనే తిరుగుతోన్న పవన్‌ ఈ సినిమా కోసం బాగా కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. 

గోపాల గోపాల చిత్రంలో తాను దేవుడి పాత్ర చేస్తున్నాడు కనుక మునుపటిలా ఎలా పడితే అలా కనిపిస్తే బాగోదని భావిస్తున్నాడట. దేవుడి క్యారెక్టర్‌ అయినా కానీ సహజంగానే కనిపించే పాత్ర కాబట్టి పవన్‌ లుక్‌ పరంగా ఎక్కువ మార్పులు ఉండకపోవచ్చు. అయితే తన రెగ్యులర్‌ స్టయిల్‌కి భిన్నంగా కనిపించాలని పవన్‌ ఆలోచిస్తున్నాడు. 

ఈ పాత్ర కోసం డిఫరెంట్‌ బాడీ లాంగ్వేజ్‌తో పాటు, కాస్టూమ్స్‌ పరంగా కేర్‌ తీసుకోవాలని పవన్‌ ట్రై చేస్తున్నాడు. అలాగే ఈ సినిమా పూర్తి చేసేంత వరకు గబ్బర్‌సింగ్‌ 2 మొదలు పెట్టరాదని కూడా పవన్‌ డిసైడ్‌ అయ్యాడు.