బాహుబలి వచ్చే ఏడాదికి రెడీ అవుతుందని అనుకుంటున్నారు. కానీ ఇప్పటి నుంచే సినిమా మార్కెటింగ్ పై నిర్మాణ వర్గాలు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ మధ్య సీడెడ్ హక్కులు సాయి కొర్రపాటి 13 కోట్లకు చేజిక్కుంచుకున్నట్లు ఫీలర్ ఒకటి బయటకు వచ్చింది. అయితే అది కేవలం ఫీలర్ మాత్రమే అని, కేవలం మార్కెటింగ్ టెక్నిక్ తో, సినిమాకు బేరాలు, రేటు పలికించేందుకు చేసిన ప్రయత్నం అని గుసగుసలు వినిపించాయి.
ఈ సంగతి ఎలా వున్నా కేవలం ఆంద్ర, కర్ణాటక ప్రదర్శన హక్కుల ద్వారా 100 కోట్లు రప్పించాలన్నది యూనిట్ ఆలోచనగా గుసగుసలు వినిపిస్తున్నాయి. నైజాం కు 25 నుంచి 30 కోట్ల మధ్య రావాలని అంచనా వేస్తున్నారట. అలాగే వివిధ ప్రాంతాలకు రేట్లు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. కానీ ఇంత భారీ ధరలను చూసి, పంపిణీ జనం అంతగా ముందుకు వస్తారా లేదా అన్నది ఇప్పటికి ఇంకా తెలియడటం లేదు.
ప్రభాస్ హోమ్ ప్రొడక్షన్ యువి క్రియేషన్స్ గుంటూరు, కృష్ణా ప్రాంత హక్కులు తీసుకోవాలని చూస్తున్నట్లు వినికిడి. చూడాలి..జక్కన్న తన తెలివితేటలతో బాహుబలి మార్కెటింగ్ ను కూడా ఎలా కొత్త పుంతలు తొక్కిస్తాడో?