విశిష్టమైన కథలతో సినిమాలు తెరకెక్కించడం దర్శకుడు విక్రమ్ కుమార్ కు మహా సరదా. 13బి, ఇష్క్, మనం అన్ని కథలు వైవిధ్యమైనవే. ఇప్పడు అలాంటి కథనే ఒకటి తయారుచేసుకున్నాడని వినికిడి. అందులో హీరో మూడు పాత్రలలో నటించాల్సి వుంటుంది. యంగ్, మిడిల్, ఇంకా ఓల్డ్ ఏజ్డ్ గా. ఈ కథను మహేష్ బాబుకు ముందుగా వినిపించడాట.
అంతా బాగానే వుంది కానీ, ఓల్డ్ గెటప్ తనకు సూట్ కాదని మహేష్ నో అన్నాడని వినికిడి. ఆ తరువాత ఈ కథ పవన్ దగ్గరకు కూడా వెళ్లిందని తెలుస్తోంది. అక్కడా పాజిటివ్ సమాధానం రాలేదట. కమల్ హాసన్ మాత్రమే ఇలాంటి కథకు సూట్ అవుతాడని, అతగాడు ఇప్పుడు ఖాళీగా లేడని టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. మరి విక్రం ఈ కథ పక్కన పెట్టి కొత్త కథ ఏదన్నా మొదలెడతాడేమో చూడాలి. పైగా అఖిల్ కు దర్శకుడు విక్రం అన్న టాక్ కూడా వుండనే వుంది మరి.