తెరపై హీరోయిన్ పెదాల్ని తన పెదాలతో జుర్రేయడంలో స్పెషలిస్ట్‌గా పేరొందిన బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ, వీలు చిక్కినప్పుడల్లా ‘ఆన్ స్క్రీన్ లిప్ టు లిప్ కిస్’ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుంటాడు. తాజాగా ఆయన తెరపై మూతి ముద్దుల గురించి మాట్లాడుతూ, ‘గతంలో ఆ ముద్దులపై ప్రేక్షకుల్లో వున్న ఆసక్తి ఇప్పుడు లేదు’ అంటూ తేల్చేశాడు.
అదేమని అడిగితే, ‘అప్పుడు అది చాలా అరుదైన విషయం.. ఇప్పుడు సర్వసాధారణమైపోయింది.. చాలా సినిమాల్లో లిప్ టు లిప్ కిస్ సన్నివేశాలు కన్పిస్తున్నాయి.. వాటికి తోడు సాధారణ జీవితంలోనూ లిప్ టు లిప్ కిస్ అనేది తప్పు.. అన్న భావన పోయింది.. బహిరంగంగానే అలాంటివి చూస్తున్నాం.. ఇక తెరపై వాటిని చూడ్డానికి ఎవరైనా ఎందుకు ఇష్టపడ్తారు..’ అని ఇమ్రాన్ హష్మీ వ్యాఖ్యానించాడు.
ఇమ్రాన్ చెప్పిందీ నిజమే. దాదాపుగా బాలీవుడ్‌లో హీరోయిన్లంతా లిప్ టు లిప్ కిస్‌ని ఎంజాయ్ చేసినవాళ్ళే. హీరోలయితే మరీనూ.!