సన్నీలియోన్‌తో గొడవల్లేవట

రిచా చడ్డా పేరిప్పుడు బాలీవుడ్‌ గాసిప్స్‌ కాలమ్స్‌లో గిరగిరా తిరిగేస్తోంది. కారణం సన్నీలియోన్‌తో కలిసి నటించే చాన్సొస్తే, ‘చేయను..’ అని ఆమె తెగేసి చెప్పడమే. మామూలుగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదుగానీ, వరుసగా…

రిచా చడ్డా పేరిప్పుడు బాలీవుడ్‌ గాసిప్స్‌ కాలమ్స్‌లో గిరగిరా తిరిగేస్తోంది. కారణం సన్నీలియోన్‌తో కలిసి నటించే చాన్సొస్తే, ‘చేయను..’ అని ఆమె తెగేసి చెప్పడమే. మామూలుగా అయితే ఇదేమంత పెద్ద విషయం కాదుగానీ, వరుసగా మూడు ఆఫర్లు కేవలం సన్నీలియోన్‌ కారణంగానే వద్దనేసుకుంటే.. కాస్త ఆలోచించాల్సిందే. అందుకే రిచా చడ్డా గురించి బాలీవుడ్‌లో నలుగురూ నాలుగు రకాలుగా అనుకుంటున్నారు.

‘రాగిణి ఎంఎంఎస్‌`2’, ‘టినా అండ్‌ లోలో’ సినిమాల్లో నటించే అవకాశం వస్తే, ఆ సినిమాల్లో సన్నీలియోన్‌ నటించడాన్ని ఇష్టపడని రిచా, ఆ ఆఫర్లను వదులుకుంది. తాజాగా ‘మస్తీజాదే’ సినిమాలోనూ నటించే అవకాశాన్ని వద్దనుకుంది రిచా చడ్డా. ఈ సినిమాలోనూ సన్నీలియోన్‌ నటిస్తుండడం గమనార్హం.

ఎందుకలా.? అని ప్రశ్నిస్తే, ‘నేను అవకాశాలు వదులుకున్నది సన్నీలియోన్‌ కోసం కాదు.. ఆమెపై నాకు ఎంతోకొంత గౌరవం వుంది..’ అంటూ తెలివిగా తప్పించుకుంది రిచా చడ్డా. అయితే ఆ సినిమాలన్నీ ‘సెక్సువల్‌ కంటెంట్‌’ ఎక్కువగా వున్నవనీ, అలాంటి సినిమాల్లో సన్నీలియోన్‌తోపాటు నటిస్తే, క్రెడిట్‌ అంతా సన్నీలియోన్‌కే దక్కుతుంది తప్ప, తనకేమాత్రం గుర్తింపు దక్కదనేది రిచా చడ్డా ‘క్రెడిట్‌’ లెక్కల సారాంశమట. అందుకే, సన్నీలియోన్‌తో కలిసి నటించడానికి రిచా ‘నో’ చెప్పేస్తోందట. అదీ అసలు విషయం.
మేటర్‌ ఇంత క్లియర్‌గా అర్థమవుతోంటే, ‘అబ్బే గొడవల్లేవ్‌..’ అని రిచా అనేస్తే ఎలా.?