మనం లాంటి మంచి సినిమాకు అండగా నిలిచిన మీడియాకు నటుడు నాగార్జున అభినందనలు తెలుపుతారని ఒక్కసారి గుప్పమంది. అందుకు తగ్గట్లే మీడియా ప్రతినిధుల ఫోటోలు, డిజిగ్నేషన్లు, ఇంకా..ఇంకా అర్జెంట్ గా పంపాలని మేసేజ్ వచ్చేసింది. ఇకనేం..మెమెంటోలే ఇస్తారో ఇంకేం చేస్తారో అని అందరూ పంపేసారు.
అక్కడితో ఆగకుండా 50రోజుల వేడుకకు ఫ్యామిలీలతో రావాలన్నారు. ఇంకా ఉత్సాహం పెరిగింది. ఏం చేస్తారో అని..కార్యక్రమం ప్రారంభం అవుతుంటే అన్నపూర్ణ సంస్థకు చెందిన సాయిబాబు వచ్చి..లోపలకు రండి..ముందు మీ కార్యక్రమమే అన్నారు. అదేంటో అని అందరూ బొలోమని లోపలకు వెళ్లారు. మీడియా చాలా సహకరించింది..ధన్యవాదాలు..అందుకు సంబంధించి ఓ అడియో విడియా ప్రెజంటేషన్ అన్నారు.
పట్టుమని పది సెకెండ్లు వుందో లేదో..నాలుగో అయిదో స్లయిడ్లు..వాటిలో పదో ఇరవయ్యో ఫొటోలు.ఎవరివి వారేగుర్తు పట్టే లోగా క్షణంలొ, నాగ్ భాషలో చెప్పాలంటే చిటికెలో అయిపోయింది. ఆపైన మీడియా వాళ్లు కొంత మంది మాట్లాడతారు అన్నారు. అదెవరిని ఎంపిక చేసారో అంటే సినిమాకు పీఆర్వోగా పనిచేసిన బిఎ రాజు..మా టీవీ మీడియా వ్యవహారాలు చూసే రఘు..ఇద్దరూ మాట్లాడేసారు..అయిపోయింది..మీడియా ముచ్చట. ఇక సినిమా వాళ్లు..వాళ్ల కార్యక్రమాలు..వాళ్లకి మెమెంటోల బహుకరణ. చివరకాఖరుకు అందరికీ భోజనాలు..
ఇదీ కార్యక్రమం. మీడియాకు అభినందన.. నిజానికి అభినందన అవసరం లేదు. మీడియా చేసేది డ్యూటీనే..కానీ ఎస్సెమ్మెస్ లు ఇచ్చి, హడావుడి చేసి, తీరా చేసి ఇలా తుస్సుమనిపించడం మాత్రం బాలేదు.