ఆ సుఖం మ‌రిగిన పోసాని

ద‌ర్శక‌త్వం, ర‌చ‌న కంటే… న‌ట‌నే బాగుందంటున్నాడు పోసాని కృష్ణముర‌ళి. ఈమ‌ధ్య క‌మ‌ర్షియ‌ల్ తెలుగు సినిమాల్లో పోసానిని తెగ వాడేసుకొంటున్నారు. పోసాని డైలాగ్ డెలివ‌రీ, బాడీ లాంగ్వేజ్ జ‌నాన్ని తెగ న‌వ్విస్తోంది. తాజాగా టెంపర్‌లోనూ మంచి…

ద‌ర్శక‌త్వం, ర‌చ‌న కంటే… న‌ట‌నే బాగుందంటున్నాడు పోసాని కృష్ణముర‌ళి. ఈమ‌ధ్య క‌మ‌ర్షియ‌ల్ తెలుగు సినిమాల్లో పోసానిని తెగ వాడేసుకొంటున్నారు. పోసాని డైలాగ్ డెలివ‌రీ, బాడీ లాంగ్వేజ్ జ‌నాన్ని తెగ న‌వ్విస్తోంది. తాజాగా టెంపర్‌లోనూ మంచి పాత్రే ద‌క్కింది. 

న‌టుడిగా రోజు రోజుకీ డిమాండ్ పెరుగుతున్న నేప‌థ్యంలో న‌టుడిగానే ఫిక్సయిపోతా అంటున్నాడీ ద‌ర్శకుడు. ఇది వ‌ర‌కు హిట్టు, ఫ్లాపుల‌తో త‌న కెరీర్ ఆడుకొనేద‌ని, న‌టుడిగా త‌న‌కు అన్నీ విజ‌యాలే ల‌భిస్తున్నాయ‌ని, ఎంతో అవ‌స‌ర‌మైతే త‌ప్ప‌.. మ‌ళ్లీ ద‌ర్శక‌త్వం వైపు అడుగులు వేయ‌న‌ని అంటున్నాడు పోసాని. 

అవును మ‌రి రోజుకి ల‌క్షకు త‌క్కువ కాకుండా పారితోషికం ఇస్తారు.. నెల‌కు నాలుగైదు సినిమాలు చేసుకొన్నా… బండి సూప‌ర్ ఫాస్ట్‌గా న‌డిచిపోతుంది ద‌ర్శకుడిగా మ‌నోడికి అన్నిహిట్లు లేవు. కాబ‌ట్టి ఈ మార్గమే బాగుంద‌ని అలా బండి లాగించేస్తున్నాడ‌న్నమాట‌.