Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బాల‌య్య చుట్టూ క‌ల్యాణ్‌రామ్ చ‌క్కర్లు

బాల‌య్య చుట్టూ క‌ల్యాణ్‌రామ్ చ‌క్కర్లు

ప‌టాస్‌తో హిట్టు కొట్టాడు నంద‌మూరి క‌ల్యాణ్‌రామ్‌. ఈ సినిమాతో నిర్మాత‌గానూ బూస్టప్ ల‌భించింది. అదే ఊపులో కిక్ 2 ప‌నులూ పూర్తి చేసేస్తున్నాడు. ఇప్పుడు అర్జెంటుగా బాబాయ్ బాల‌య్యతో ఓ సినిమా చేయాల‌ని కంక‌ణం క‌ట్టుకొన్నాడు. బాబాయ్‌కి త‌గిన క‌థ తయారు చేసే ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నాడు కల్యాణ్‌రామ్‌. 

క‌థ రెడీ చేసి దాన్ని ఓకే చేయించాల‌ని క‌ల్యాణ్‌రామ్ తాప‌త్రయం. వందో సినిమా ప్రాజెక్టు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై చేస్తే.. బాగుంటుంద‌ని అనుకొంటున్నాడ‌ట. ఈ ప్రతిపాద‌న బాబాయ్ ముందూ పెట్టాడు. అయితే బాల‌య్య అటు వారాహి వాళ్లకి మాటిచ్చేశాడు. ఇప్పుడు ఏం చేయాలో బాల‌కృష్ణకీ అర్థం కావ‌డం లేద‌ని టాక్‌. 

బాల‌య్య వందో సినిమాకి బోయ‌పాటి శ్రీ‌ను దర్శక‌త్వం వ‌హిస్తాడు. మ‌రి క‌ల్యాణ్ రామ్ రెడీ చేసిన క‌థ బోయ‌పాటికి న‌చ్చుతుందా అన్నది పెద్ద ప్రశ్న‌. న‌చ్చితే ఆ క‌థ‌తోనే బాల‌య్య 100వ సినిమా ఉండొచ్చు. మ‌రి బాబాయ్ క‌నిక‌రిస్తాడో లేదో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?