Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బ్రహ్మీ.. వీకెండ్ వెంక‌ట్రావ్!

బ్రహ్మీ.. వీకెండ్ వెంక‌ట్రావ్!

బ్రహ్మానందం మ‌ళ్లీ జూలు విద‌ల‌చ్చబోతున్నాడా..??  క్లైమాక్స్‌కి ముంద‌రొచ్చి సినిమా క్రెడిట్ అంతా భుజాన వేసుకొని వెళ్లిపోయే మ‌రో వెరైటీ పాత్రలో క‌నిపించ‌బోతున్నాడా..??  ఔన‌నే అంటున్నాయి ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు. 

రేసుగుర్రంలో కిల్‌బిల్ పాండే గా న‌వ్వించాడు బ్రహ్మీ.. ఆ త‌ర‌వాత ఆ స్థాయిలో న‌వ్వించ‌లేదు. ఆ లోటు తీర్చడానికి వీకెండ్ వెంక‌ట్రావ్‌గా ముస్తాబు అవుతున్నాడు. రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం పండ‌గ చేస్కో. గోపీచంద్ మలినేని  ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో బ్రహ్మీ వీకెండ్ వెంక‌ట్రావ్‌గా న‌వ్వులు పంచ‌బోతున్నాడ‌ని తెలిసింది. 

రెడీ సినిమాలో రామ్ - బ్రహ్మీ పండించిన వినోదం.. ఆ సినిమాకి ప్లస్ అయ్యింది. మ‌రి ఈ వెంక‌ట్రావ్ ఎన్ని వేషాలేస్తాడో చూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?