రంగారెడ్డి జిల్లాలో సంచలనం రేపిన 14 ఏళ్ళ బాలిక హత్యకేసు మిస్టరీ వీడిరది. తండ్రే ‘కామ’యముడిగా పోలీసులు తేల్చారు. నిన్ననే ఈ విషయమై పోలీసులు స్పష్టత ఇచ్చినా, ఈ రోజు అధికారికంగా పూర్తి వివరాల్ని మీడియా ముందుంచారు పోలీసు ఉన్నతాధికారులు. హైద్రాబాద్ నుంచి తన కుమార్తెను రంగారెడ్డి జిల్లా వికారాబాద్కి తీసుకెళ్ళిన మెగావత్ కమల్, జనసంచారంలేని చోటకు తీసుకెళ్ళి ఆ బాలికపై అత్యాచారం జరిపి, చంపేశాడు.
ఎవరికీ అనుమానం రాకుండా తన కుమార్తెను కొందరు దుండగులు ఆటోలో వచ్చి ఎత్తుకెళ్ళారని కమల్ కన్నీరు మున్నీరయ్యాడు. అయితే కూతుర్ని ఎత్తుకెళ్ళారంటూ కమల్ చెబుతున్న కట్టు కథల్లో ఒకదానితో ఒకటి పొంతన లేకపోవడంతో పోలీసులు ఆ దిశగా దృష్టి సారించారు. ఆటోడ్రైవర్లనీ, ఇతరుల్నీ విచారించిన పోలీసులు, కమల్ ఈ దారుణానికి ఒడిగట్టాడా? అన్న కోణంలో విచారణ జరిపి, నిజాలు రాబట్టారు.
ప్రాథమిక పరిశీలనలో అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయ్యిందనీ, పక్కా ప్లానింగ్‌తోనే కూతుర్ని బంధువుల ఇంటి నుంచి వికారాబాద్కి తీసుకెళ్ళి ఆమెపై కమల్ అత్యాచారం జరిపాడని పోలీసులు తేల్చారు. కన్నతండ్రే నరరూప రాక్షసుడిగా, కామంతో కళ్ళు మూసుకుపోయి, కన్న కూతురిపై అత్యాచారం జరిపిన మృగాడిగా మారిన కమల్‌పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కమల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి.