ఐటం సాంగుకు సై అంటున్న కాజల్‌!

ఒకస్థాయి హీరోయిన్‌ ఇమేజి వచ్చేసిన తర్వాత.. కరాస్త స్పైసీగా ఒక ఐటం సాంగు చేయడానికి నాయికలందరూ ముచ్చటపడతారేమో అనిపిస్తోంది. నవతరంలో తమన్నా, శృతిహాసన్‌ ల తర్వాత… టాలీవుడ్‌నుంచి ఇప్పుడు ఐటం సాంగ్‌కు సై అంటున్న…

ఒకస్థాయి హీరోయిన్‌ ఇమేజి వచ్చేసిన తర్వాత.. కరాస్త స్పైసీగా ఒక ఐటం సాంగు చేయడానికి నాయికలందరూ ముచ్చటపడతారేమో అనిపిస్తోంది. నవతరంలో తమన్నా, శృతిహాసన్‌ ల తర్వాత… టాలీవుడ్‌నుంచి ఇప్పుడు ఐటం సాంగ్‌కు సై అంటున్న అగ్ర కథానాయికగా.. కాజల్‌ ఆ జాబితాలో చేరబోతోంది. 

అంజలి హీరోయిన్‌గా గీతాంజలి చిత్రాన్ని రూపొందిస్తున్న నిర్మాతలు.. ఆ చిత్రంలో ఓ ఐటం సాంగ్‌ చేయడానికి కాజల్‌ అగర్వాల్‌ను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. గతంలో ఇదే సాంగ్‌ కోసం సమంతను కూడా అడిగినట్లు వార్తలు వచ్చాయి. సమంత సంగతి ఒక కొలిక్కి రాలేదేమో గానీ.. ఇతర సినిమా పనుల మీద నగరంలో ఉన్న కాజల్‌ను కలిసి వారు ఐటం సాంగ్‌ ఆఫర్‌ చేశారుట. 

ఈ చిత్రంలోని ఐటంసాంగ్‌కు క్రేజీ హీరోయిన్‌ను పెట్టాలని నిర్మాతలు అనుకుంటున్నారని, అందుకే కాజల్‌ను సంప్రదించగా.. వారి అంచనాలను మించి ఆమె రెమ్యూనరేషన్‌ అడిగిందని సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఎంత అడిగిందన్నది మాత్రం పొక్కలేదు. ఐటం కోసం స్టార్‌ హీరోయిన్‌ కావాలి.. రెమ్యునరేషన్‌ మాత్రం తక్కువే ఉండాలి.. అనుకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు సినీజనం.