సినిమాలకు సిజి వర్క్ ప్లస్ అవుతుంది. కాస్త ఫాంటసీ వున్నకథ అయితే మరి చెప్పనక్కరలేదు. కానీ సిజి వర్క్ వల్ల సినిమాలకు ప్లస్ అవుతున్న మాట వాస్తవమే కానీ, విడుదల సమయం మాత్రం ఎప్పడు అన్నది చెప్పలేకపోతున్నారు. అంజి, అరుంధతి, ఈగ అన్నీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొన్నాయి. తాజాగా సిజి కారణంగా ఆలస్యం అవుతున్నమరో సినిమా కార్తికేయ.
చిన్న సినిమా గా ప్రారంభమై 23 నిమషాల సిజివర్క్ తో పెద్ద సినిమాగా మారింది కార్తికేయం. తెలుగుతో పాటు తమిళం వెర్షన్ తలకెత్తుకున్నారు. దీంతో సినిమా విడుదల ఆలస్యమైపోయింది జూన్,జూలై అనుకున్నది ఇంకా మరో నెల పట్టేలా కనిపిస్తోంది. దీనంతటికీ కారణం సిజి వర్క్ పెరిగిపోవడమేనట.
ఇందులో 300 ఏళ్లనాటి గుడి, పాము వ్యవహారాలు కీలకం. రియల్ పాముతో చేద్దామంటే చట్టాలు అడ్డు వచ్చాయి. దాంతొ షూటింగ్ నిలిచిపోయింది. తీసినదంతా పక్కన పెట్టి సిజి వర్క్ తో దాన్ని మళ్లీ చేసారట. సినిమా బాగా రావడంతో ఖర్చు పెంచుకుంటూ పోతున్నారు. ఎలాగైనా జూలై ఆఖరుకు విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు.