అగస్టు 22న ‘మెగా’ మూవీకి క్లాప్

అభిమాన జనం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ మూవీకి క్లాప్ ముహుర్తం ఫిక్సయిపోయింది. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ సినిమా ఓపెనింగ్ వుంటుంది. అయితే చిత్రమేమిటంటే ఈ క్షణం వరకు…

అభిమాన జనం ఎప్పడెప్పుడా అని ఎదురు చూస్తున్న మెగాస్టార్ మూవీకి క్లాప్ ముహుర్తం ఫిక్సయిపోయింది. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న ఈ సినిమా ఓపెనింగ్ వుంటుంది. అయితే చిత్రమేమిటంటే ఈ క్షణం వరకు కథ రెడీ అవలేదు. డిసైడ్ కాలేదు. నాలుగు చెరగులా మెగా క్యాంప్ జనం దీని కోసమే గాలిస్తున్నారు. కానీ దర్శకుడు ఖరారైపోయినట్లే. వివి. వినాయక్. 

ఆగస్టు 22 లోగా కథ ఖరారైపోతే రెగ్యులర్ గా షూటింగ్ లేకుంటే, కాస్త గ్యాప్. క్లాప్ మాత్రం ఆ రోజు గ్యారంటీ  అని వినిపిస్తోంది. అయితే ఇదిలా వుంటే రచయిత ఆకుల శివ ఎలాగైనా మాంచి కథ వండాలని కిందా మీదా పడుతున్నట్లు వినికిడి. వినాయక్, శివ కాంబినేషన్ మెగాస్టార్  కలిసి వస్తుందని ఆ క్యాంప్ ఆలోచన.