విశ్వరూపం 2 ను వెనక్కు నెట్టిన సీజీ వర్క్‌

విడుదల తేదీ ప్రకటించి థియేటర్లు కూడా రిజర్వు అయిన తరువాత.. సినిమా ఆగిందంటే.. నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి ముంబాయి డిజిటల్‌ ఇంటర్మీడియట్‌ వర్క్‌ జరుగుతోంది. అందులో నాణ్యత కోసం అనుకోని జాప్యం వల్ల…

విడుదల తేదీ ప్రకటించి థియేటర్లు కూడా రిజర్వు అయిన తరువాత.. సినిమా ఆగిందంటే.. నిర్మాతలు మీడియా ముందుకు వచ్చి ముంబాయి డిజిటల్‌ ఇంటర్మీడియట్‌ వర్క్‌ జరుగుతోంది. అందులో నాణ్యత కోసం అనుకోని జాప్యం వల్ల విడుదల ఆలస్యం అయింది అంటుంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆగినాసరే.. బయటకు చెప్పే సాకులు ఇవే అయి ఉంటాయి. ఇదంతా రిలీజ్‌ వరకు వచ్చిన తర్వాత చెప్పే సాకుల సంగతి. అయితే ప్లాన్‌ చేసిన విడుదలకు కొన్ని నెలల ముందు చెప్పే కారణాలు మరో రకంగా ఉంటాయి. 

మొత్తానికి ఇప్పుడు కమల్‌హాసన్‌ తాను ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న విశ్వరూపం 2 చిత్రం కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ కారణంగా ఆలస్యం అవుతున్నదని చెబుతున్నారు. ఇది ముందుగా అనుకున్న తేదీకంటె విడుదల వెనక్కు వెళుతుందని కూడా కమల్‌ చెబుతున్నారు. 

కమల్‌ సినిమాలు ప్రస్తుతం రెండు నిర్మాణంలో ఉన్నాయి. ఒకటి ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న విశ్వరూపం2 అయితే.. రెండోది రమేష్‌ అరవింద్‌ దర్శకత్వంలో కమల్‌ చేస్తున్న ఉత్తమవిలన్‌. మామూలుగా ఇదివరకు ఆయన చెప్పిన షెడ్యూలు ప్రకారం అయితే.. వీటిలో విశ్వరూపం 2నే ముందుగా విడుదల కావాలి.

అయితే.. ఇప్పుడు అది వెనక్కు వెళ్లినట్లేనని, ఈ రెండిరట్లో ముందుగా ఉత్తమ విలన్‌ విడుదల అవుతుందని కమల్‌ అంటున్నారు. విశ్వరూపంలో చాలా విపరీతమైన గ్రాఫిక్‌ వర్క్‌ చేయాల్సి ఉన్నదని.. ఇప్పటికే పని మొదలుపెట్టినప్పటికీ.. అది ఆలస్యం కావచ్చునని కమల్‌హాసన్‌ వివరణ ఇస్తున్నారు.