ఆడు కాదు, వీడు మగాడ్రా బుజ్జీ

సినిమాకి టైటిల్‌ పెట్టడం అంత ఈజీ కాదు. పైగా ప్రిన్స్‌ మహేష్‌బాబుకి టైటిల్‌ పెట్టడమంటే ఎంతో బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చేయాల్సి వుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ అనే వర్కింగ్‌…

సినిమాకి టైటిల్‌ పెట్టడం అంత ఈజీ కాదు. పైగా ప్రిన్స్‌ మహేష్‌బాబుకి టైటిల్‌ పెట్టడమంటే ఎంతో బ్యాక్‌గ్రౌండ్‌ వర్క్‌ చేయాల్సి వుంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి ప్రస్తుతం ‘శ్రీమంతుడు’ అనే వర్కింగ్‌ టైటిల్‌ కొనసాగుతున్నా ‘మగాడు’ అనే ఇంకో టైటిల్‌ కూడా పరిశీలనలో వుందట. 

మగాడు టైటిల్‌ విషయానికి వస్తే అప్పట్లో ఎన్టీఆర్‌తో ఓ సినిమా వచ్చింది. రాజశేఖర్‌తోనూ వచ్చింది. రీసెంట్‌గా ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అంటూ ప్రిన్స్‌ బావమరిది సుధీర్‌బాబుతోనూ ఒక సినిమా వచ్చింది. చరిత్రలో ఆ టైటిల్‌తో హిట్‌ అయిన రికార్డ్స్‌ అయితే లేవు. 

ఒక వేళ ప్రిన్స్‌ మహేష్‌బాబు ఛరిష్మాతో మగాడు టైటిల్‌తో సినిమా హిట్‌ అయితే రికార్డే. మగాళ్ళకే ఈర్ష్య పుట్టే మహేష్‌బాబుని మళ్ళీ ‘మగాడు’ అనడం ఎందుకు? ఎంచక్కా ‘శ్రీమంతుడు’ ఫ్యామిలీ టైటిల్‌ అంటున్నారు కాబట్టి, అదే టైటిల ఖరారు చేస్తే బెటర్‌ అంటున్నారు ఇంకొందరు. ఏదైనా డిసైడ్‌ చెయ్యడానికి ప్రిన్స్‌ అభిమానులతోనే వీలవుతుంది కాబట్టి వెయిట్‌ చెయ్యాల్సిందే.​