మామూలు ఆడవాళ్ళకే రక్షణ లేని మన సొసైటీలో హీరోయిన్స్‌కు మాత్రం రక్షణ వుంటుందా? ప్రతి ఒక్కరూ హీరోయిన్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి వాళ్ళ రక్షణలో వాళ్ళు వుండటం సహజం. షూటింగ్స్ కోసం విదేశాలకు కూడా ఒంటరిగా బయలుదేరే జాక్వెలైన్ ఫెర్నాండెజ్ తన స్వీయ రక్షణ కోసం పెప్పర్ స్ప్రేను తన బ్యాగులో పెట్టుకుని తిరిగేదట.
చూడటానికి లిప్‌స్టిక్‌లా కనిపించే ఒక క్యాన్‌లో ఆ స్ప్రే వుంటుందట. అంతకు ముందు తన రక్షణ కోసం ఒక రకమైన లోదుస్తులు విదేశాల్లో కొనుగోలు చేసిందట. కానీ అవి ఎంతో ఇబ్బంది పెడతాయని వాడటంలేదట. బహుశా అవి మన ప్రాచీన స్త్రీలు ధరించిన ఇనుప కచ్చడాలు లాంటివేమో.
అయితే నిర్మాతలు, దర్శకులు కల్పించిన రక్షణ వల్ల తనకు ఎలాంటి ఆపదా రాలేదనీ, ఇక పెప్పర్ స్ప్రే బదులు, సాల్ట్ పెప్పర్ వాడుకుంటే మేలని ఇప్పుడు ఆ రక్షణ పరికరాన్ని కూడా వదిలేసిందట. అసలు జాక్వెలైన్ ఫెర్నాండెజ్ ఒక మగరాయుడు. ఆమెని ఏమార్చే దమ్మెవరికి వుంటుంది లెండి.