కమల్ తన తరువాతి సినిమా తెలుగులోనే అని ఉత్తమ విలన్ ముందు చెప్పాడు. ఆ మాట నిలబెట్టుకునేందుకు సినిమా చేస్తున్నట్లు చెబుతున్నారు. తుంగవనం సినిమా తమిళ పేరు. ఈ సినిమా కూడా కమల్ ఎప్పటిలాగే తమిళంలోనే చేస్తున్నాడు. అయితే డబ్బింగ్ చేయకుండా, చేస్తున్నపుడే తెలుగు వెర్షన్ కు కావాల్సిన కొన్ని సీన్లు కూడా మిక్స్ చేస్తారు.
అందుకోసం ఇటు చెన్నయ్, ఇట హైదరాబాద్ లోకేషన్లు సెట్ చేసుకున్నారు. అంటే మాట నిలబెట్టుకోవాలంటే తెలుగు సినిమా చేసి, తమిళంలోకి డబ్ చేయాలి. అలా కాకుండా తమిళ సినిమానే ఒకేసారి ఇటు అటు చేస్తున్నారన్నమాట. మొత్తానికి తమిళం వాళ్లు తెలివైన వాళ్లు. వాళ్లకి తమిళ ఒరిజినల్ కావాలి..తెలుగు మార్కెట్ కావాలి. మనమే, డబ్బింగ్ సినిమా అంటే చేతులు పొడవుగా చాచేస్తాం.