హోరా హోరీ సినిమా ముందు దర్శకుడు తేజ తరచు ఓ మాట చెబుతూ వచ్చారు. లెంగ్త్ ఎక్కువ అంటూ, ఓ అలవాటు చేసి, సినిమాను చంపేస్తున్నారు. టైటానిక్, దానవీరశూరకర్ణ లాంటి సినిమాలు లెంగ్త్ ఎక్కువైనా చూడలేదా..అన్నది ఆయన పాయింట్..అండ్ ఆర్గ్యుమెంట్.
ఇలా ఎందుకు ఆయన అంటూ వచ్చాడా అన్నది హోరా హోరీ సినిమా చూసాక తెలిసింది..159 నిమిషాల లెంగ్త్. సినిమా చూసిన జనాలు మలి సగం ఫరావాలేదు కానీ తొలిసగం చాలా అంటే చాలా లెంగ్త్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఇది సినిమా యూనిట్ దగ్గరకు కూడా చేరింది. ఇప్పుడు తొలిసగం లెంగ్త్ తగ్గిస్తే ఎలా వుంటుంది అని ఆలోచనలు ప్రారంభించారు.
తొలిసగం దాదాపు గంటా ఇరవై అయిదు నిమిషాలు వుంది. అందులోంచి ఓ పది నిమిషాలు తీయగలమా అని చూస్తున్నారు. ఇప్పటికి ఓ ఎనిమిది నిమిషాలు ఐడెంటిఫై చేసినట్లు తెలుస్తోంది. రేపు మరోసారి చూసి, తగ్గించి, వెంటనే అమలు చేస్తారని వినికిడి.