అమెరికా లో వైసిపి అభిమానులతో బొత్స భేటి

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ అధినేత శ్రీ బొత్సా సత్యనారాయణ గారి రాక  సందర్భంగా మేరీల్యాండ్ అమెరికాలో వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సెప్టెంబర్ 07 సోమవారం నాడు పెద్ద…

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ అధినేత శ్రీ బొత్సా సత్యనారాయణ గారి రాక  సందర్భంగా మేరీల్యాండ్ అమెరికాలో వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు సెప్టెంబర్ 07 సోమవారం నాడు పెద్ద ఎత్తున  మీట్ & గ్రీట్ జరుపుకున్నారు. హొటల్‌ పారడైస్ ఇండియన్ కుసిన్ (ఇండి క్లబ్) లో నిర్వహించిన  ఈ సభలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు, నాయకులు, అభిమానులు 200 మందికి పైగా పాల్గొన్నారు.

దివంగత నేత తెలుగు ప్రజల స్ఫూర్తి ప్రదాత శ్రీ రాజశేఖర రెడ్డిగారికి జ్యోతి ప్రజ్వలన, పుష్ప గుచ్చాలతో అంజలి ఘటించిన పిమ్మట  వ్యాఖ్యాతగా వ్యవహరించిన ప్రసన్న కాకుమాని గారు సభను ప్రారంభించారు

ఈ సభలో అతిధులు శ్రీ రాజేశ్వర్ రెడ్డి గంగసాని, ప్రెసిడెంట్ ఎలెక్ట్ నాట, శ్రీ రాఘవ రెడ్డి గొసల, వైయస్ఆర్‌ ఫౌండేషన్, శ్రీ రత్నాకర్ పండుగాయల, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కన్వీనర్, మరియు శ్రీ రమేష్ రెడ్డి వల్లూరు, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అడ్విసేర్ & మిడ్ అట్లాంటిక్ రీజియన్ కోఆర్డినేటర్ ప్రసంగించారు.

స్థానిక YSRCP సభ్యులు ప్రసంగిస్తూ శ్రీ రాజశేఖర రెడ్డిగారి ఆశయాలను ,ప్రవేశపెట్టిన పధకాలను కొనియాడుతూ,ప్రస్తుత ప్రభుత్వ తీరు తెన్నులను తూర్పారబట్టారు .శ్రీ రాఘవ రెడ్డిగారు మాట్లాడుతూ పెద్దాయన ఏర్పరచిన దారిలో నడుస్తున్న నేటి తరము యువ నేత జగన్ గారికి మన సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు.శ్రీ రాజేశ్వర్ రెడ్డిగారు ఉపన్యసిస్తూ మారిన కాలానికి అనుగుణంగా మన దేశ ఆర్థిక పరిస్థితులు మారాలని,యువతరం ముందుకు రావాలని,ఇపుడున్న ప్రభుత్వం ఏ మాత్రం మన సామాన్య ప్రజల కనీస అవసరాలు తీరుస్తున్నారో అందరూ చూస్తున్నారని సెలవిచ్చారు.అలాగే నిన్నటి రాజన్న పరిపాలనలో కాంచిన పేదవారి చిరునవ్వులు  రేపు మల్లీ విరబూయాలంటే జగన్ లాంటి నాయకుడు రాష్ట్రానికి రధ సారధిగా రావాలని పునరుధ్ఘాటించారు. 

ఫిదప శ్రీ రత్నాకర్ గారు మాట్లాడుతూ NRI YSRCP అంతా ఒక్కటై ఒకేమాటగా ఒకే బాటగా YSRCP పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అందుకు మీ అందరి సహాయ సహకారాలు చాలా అవసరమని పేర్కొన్నారు .శ్రీ రమేష్ రెడ్డి గారు ప్రసంగిస్తూ తరాలు మారినా రాజశేఖరుడిలాంటి గొప్ప రాజకీయవేత్త, పేదలపాలిటి పెన్నిధి మనకు కానరారని ,కులమత ప్రాంతాలకు అతీతంగా అజన్మాంతం సామాన్యుడి మదిలో నిలిచిపోయారని ,అలాంటి మహనీయుని ఆశయాలకు వారసుడుగా ఆశయ సాధనలో ధీరుడిగా పాలక పక్షం గుండెల్లో రైల్లు పరిగెత్తిస్తున్న జగన్ గారు రాష్టానికి నాయకులుగా వచ్చే ఎన్నికల్లో గెలుపొందేవిధంగా మన నవతరం పాటుపడాలని పిలుపునిచ్చారు..

YSCRCP నాయకులు శ్రీ బోత్స సత్యనారాయణగారు ఉపన్యసిస్తూ అమెరికాలో ఉండే  ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరచి వచ్చే ఎన్నికలలలో గెలిచే ప్రణాళికను రూపొందించాలని అందులో భాగంగా మన పార్టీని బలోపేతం చేసే వ్యూహం తన పర్యటనలో  భాగమని , అందరికీ అధినాయకత్వంతో Internet ద్వారా ముఖా ముఖి చర్చలను త్వరలో ప్రవేశపెట్టబోతున్నారని, తద్వార దేశ విదేశాల్లోని తెలుగువారు నేరుగా పార్టీ నాయకత్వంతో అన్ని విషయాలను సమగ్రంగా చర్చించే అవకాశం ఉందని  తెలియజేశారు. 
NRIలు అంతా కలసి ఇంత కన్నుల పండుగలా జరుపుకుంటున్న ఈ కార్యక్రమ ముఖ్య కార్యకర్తలను  ఈ సంధర్భంగా   అభినందించారు.పిదప పలువురు ప్రేక్షకులు అడిగిన పలు ప్రశ్నలకు తనదైన రీతిలో ప్రతిస్పందించి YSRCP అధినాయకత్వానికి తాను ప్రజలు వెలిబుచ్చిన అభిప్రాయాలన్నింటినీ ఓ నివేదిక ద్వారా సమర్పిస్తున్నట్లు కరచాలనముల మధ్య తెలియజేశారు.

ఈ సభలో ముఖ్య అతిధి  బొత్సా సత్యనారాయణ గారు ప్ర‌జా సంక్షేమ‌మే ఊపిరిగా ప్ర‌జ‌ల మ‌న‌స్సులో నిలిచిన నేత వైఎస్సార్‌ అని, దివంగ‌త మ‌హానేత అమ‌లు చేసిన ప్ర‌జా సంక్షేమ ప‌థ‌కాల రూపంలో ఆయ‌న ఇప్ప‌టికీ మ‌నంద‌రి గుండెల్లో నిలిచి ఉన్నారని చెప్పారు. శ్రీ రమేష్ రెడ్డి వైయస్ఆర్‌ గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత …తెలుగు ప్రజలు ఎప్పటికీ మరచిపోని మహనీయుడు దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారని కొనియాడారు, రాజన్న సువర్ణ యుగం నాటి రాష్ట్రం ప్రస్తుత పాలకుల చేతగాని తనం కారణంగా రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కనీసం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిందని విచారం వ్యక్తంచేశారు. జాతీయ స్థాయిలో రాష్ట్రం ప్రతిష్టను పెంచి గౌరవంగా తల ఎత్తుకునే విధంగా చేయగల నాయకుడు యువనేత శ్రీ వైయస్‌ జగన్‌ ఒక్కరే అని వారు ధీమాగా పేర్కొన్నారు          
                  
మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే శ్రీ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు వక్తలు అన్నారు. శ్రీ జగన్‌ నాయకత్వం కోసం తెలుగు ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం అహర్నిశలూ కృషి చేసిన మహానేత డాక్టర్‌ వైయస్ఆర్‌ అడుగుజాడల్లోనే నడుస్తారని, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సమర్థవంతమైన నాయకుడిగా మంచి చేస్తారన్న ధీమా వ్యక్తంచేశారు. రానున్న 2019 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని,  శ్రీ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమన్న ధీమాను వ్యక్తంచేశారు.

ఈ కార్యక్రమంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కోర్ కమిటి సభ్యులు కిరణ్ ముక్తాపురం, ప్రసన్న కాకుమాని, నినాద్‌రెడ్డి అన్నవరం, వెంకట్ రాజ రెడ్డి, ససాంక్ అరమడక, రాంగోపాల్ దేవపట్ల, ప్రవాసాంధ్ర ప్రముఖులు జనార్ధన్ నానికాల్వ, కోట్ల తిప్పా రెడ్డి, నాగార్జున రాజు కొండూరు, నోయెల్ కట్టా, నరసా రెడ్డి ఆవుల, ప్రతాప్ కాకర్ల, స్టాన్లీ మేడికొండ, సుదర్శన్ దేవిరెడ్డి, సునీల్ దేవిరెడ్డి,వెంకట్ రెడ్డి ఎర్రం, విజయ మోహన్ కోకటం, సతీష్‌ రెడ్డి నరాల, శ్రీధర్ నాగిరెడ్డి, శ్రీనివాస్ ఆవుల, రాజశేఖర్‌ బసవరాజు, రాజశేఖర్ పోచారెడ్డి, పెంచాల్ రెడ్డి,  సౌర్య ప్రసాద్ కోచెర్ల, శేషు మరియు అనేకులు పాల్గొన్నారు.

అలబామా నుంచి శ్రీనివాస రెడ్డి యర్రబోతుల, డెలావేర్ నుంచి  అంజి రెడ్డి సాగం, న్యూజెర్సీ నుంచి సాత్విక్ రెడ్డి గోగులమూడి, ఆంధ్ర ప్రదేశ్, ఇండియా నుంచి ప్రసాద్ రెడ్డి మల్లు, రామకృష్ణ రెడ్డి రాజోలి, కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.

చివరగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున శ్రీ కిరణ్ ముక్తాపురం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. చివరగా పసందైన విందు భోజనంతో బోత్స సత్యనారాయణ గారి సన్మాన  కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.