అమెరికాలో శ్రీమంతుడు ఫిఫ్టీడేస్ ఫంక్షన్?

శ్రీమంతుడు..మహేష్ బాబుకు వెయ్యి ఓల్టుల ఎనర్జీని ఇచ్చిన సినిమా. ఇటు వంద కోట్లకు పైగా షేర్ సాధించడమే కాకుండా, ఓ మంచి పెర్ ఫార్మర్ గా పేరు తెచ్చింది. జనాల్లో గౌరవాన్ని పెంచింది. ఈ…

శ్రీమంతుడు..మహేష్ బాబుకు వెయ్యి ఓల్టుల ఎనర్జీని ఇచ్చిన సినిమా. ఇటు వంద కోట్లకు పైగా షేర్ సాధించడమే కాకుండా, ఓ మంచి పెర్ ఫార్మర్ గా పేరు తెచ్చింది. జనాల్లో గౌరవాన్ని పెంచింది. ఈ సినిమా ఓవర్ సీస్ లో కూడా అద్భుతమైన విజయాన్ని సాధించింది.

ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శ్రీమంతుడు ఫిఫ్టీడేస్ ఫంక్షన్ లేదా థాంక్స్ మీట్ ను అమెరికాలో నిర్వహిస్తే ఎలా వుంటుంది అని ఆలోచిస్తున్నాడట మహేష్. పైగా ఈ సినిమా నిర్మాతలు ముగ్గురు కూడా ఎన్నారైలే. యుఎస్ లో మాంచి సర్కిల్ వున్నవారు. అందువల్ల అక్కడే ఫంక్షన్ చేస్తే బాగుంటుంది అని భావిస్తున్నారు.

పైగా ఇలా చేయడం వల్ల టాలీవుడ్ కు యుఎస్ మార్కెట్ ను మరింత ప్లస్ గా మారుస్తుంది కూడా. అమెరికా అభిమానులకు, టాలీవుడ్ సినిమా జనాలు కాస్త టచ్ లో వుంటూ, ఇండస్ట్రీ మార్కెట్ ను అక్కడ మరింత విస్తృతం చేసే అవకాశం వుంటుంది. ఓవర్ సీస్ మార్కెట్ అన్నది ఇప్పుడు టాలీవుడ్ కు కీలకంగా మారింది. మీడియం రేంజ్ సినిమాలకు నిర్మాణపు ఖర్చులో చాలా వరకు ఓవర్ సీస్ మార్కెట్ నే అందిస్తోంది.

శ్రీమంతుడు సినిమాకు ఒక్క యుఎస్ మార్కెట్ నే 12 కోట్ల వరకు షేర్ అందించింది. ఇధికాక మిగిలిన దేశాల్లో రెండు కోట్ల వరకు వచ్చింది. అంటే దాదాపుగా మన నైజాం మార్కెట్ తో సమానం. ఇప్పుడు భలే భలే మగాడివోయ్ సినిమా కూడా ఓవర్ సీస్ లో 10లక్షల డాలర్ల ఆదాయానికి చేరువలో వుంది. సో..మహేష్ నిర్ణయం ఓవర్ సీస్ మార్కెట్ కు మరింత బూస్ట్ ఇవ్వడం ఖాయం.