నాని… ఈసారైనా రానీ..

ఒకే నెల‌లో నావి మూడు సినిమాలొస్తున్నాయ్ అంటూ చంక‌లు గుద్దుకొన్నాడు నాని. పైసా, ఆహా క‌ల్యాణం, జెండా పైక‌పిరాజు ఫిబ్రవ‌రి నెల‌లోనే విడుద‌లకు సిద్ధమ‌య్యాయి. అయితే తొలి రెండు సినిమాలూ ఫ‌ట్ట‌య్యాయి. మూడో సినిమా…

ఒకే నెల‌లో నావి మూడు సినిమాలొస్తున్నాయ్ అంటూ చంక‌లు గుద్దుకొన్నాడు నాని. పైసా, ఆహా క‌ల్యాణం, జెండా పైక‌పిరాజు ఫిబ్రవ‌రి నెల‌లోనే విడుద‌లకు సిద్ధమ‌య్యాయి. అయితే తొలి రెండు సినిమాలూ ఫ‌ట్ట‌య్యాయి. మూడో సినిమా జెండాపైక‌పిరాజు త‌మిళంలో డింకీలు కొట్టింది. 

ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలుగులో ఆ సినిమాని విడుద‌ల చేయ‌డానికి సాహ‌సించ‌లేక‌పోయారు నిర్మాత‌లు. ఆ త‌ర్వాత ఒక‌ట్రెండు సార్లు రిలీజ్ డేట్ ప్రక‌టించి.. ఆ త‌ర‌వాత తూచ్ చెప్పారు. ఇప్పుడు మ‌ళ్లీ జెండాపైక‌పిరాజు హ‌డావుడి క‌నిపిస్తోంది. జులై చివ‌రి వారంలో ఈ సినిమాని ఎట్టిప‌రిస్థితుల్లోనూ తీసుకురావాల‌ని చిత్రబృందం భావిస్తోంది. 

నాని కూడా సాధ్యమైనంత త్వర‌గా ఈ సినిమాని విడుద‌ల చేయ‌మ‌ని నిర్మాత‌ల‌కు రిక్వెస్ట్ చేస్తున్నాడ‌ట‌. కావాలంటే ప్రమోష‌న్ల విష‌యంలో స‌హాయం చేస్తాన‌ని కూడా అంటున్నాడ‌ట‌. మొత్తానికి జెండా దుమ్ము దులిపి, మ‌ళ్లీ ఎగ‌రేయ‌డానికి రెడీ అవుతున్నారు. ఈసారైనా వ‌స్తుందో, లేదంటో చివ‌రి నిమిషాల్లో సారీ చెబుతారో.. చూడాలి.​