గడచిన రెండు మూడేళ్లుగా తెలుగు సినిమా పరిశ్రమ సంగీత విభాగంలో ఎక్కువగా వినిపిస్తున్న రెండు పేర్లు దేవీశ్రీ ప్రసాద్, థమన్. గడచిన ఏడాది అయితే రేస్ లో థమన్ ఎక్కవ. ఎందుకంటే దేవీ తమిళంలో బిజీ బిజీ కాబట్టి. అయితే కాస్త క్వాలిటీ, జనాలకు పట్టే పాటల విషయానికి వస్తే, దేవీయే ముందుంటాడు. థమన్ కు ఎందుకు ఎలా అవకాశాలు వస్తున్నాయో కానీ మంచి ఆల్బమ్ లు రావడం లేదన్న అసంతృప్తి ప్రేక్షకుల్లో వుంది.
ఇప్పుడు ఈ వైనాన్ని ప్రతిబింబిస్తోంది ఫిలింఫేర్ అవార్డుల నామినేషన్ల జాబితా. ఉత్తమ సంగీత దర్శకుడు కేటగిరీలో థమన్ పేరే లేదు. అన్ని సినిమాలు చేసినా కూడా. అనూప్, విక్కీ జె మేయర్, సన్నీ (స్వామిరారా) తో పాటు దేవీ రెండు ఎంట్రీలతో ఈ జాబితాలో వున్నాడు. ధమన్ మాత్రం లేడు.