సాయి స్కీమ్ ఫలించినట్లే

ఒక్కోసారి చిత్రాలు జరుగుతుంటాయి. చిన్న సినిమాలు చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తుంటాయిు నిజానికి వాటికి వున్న స్టామినా కంటే, ప్రచారం కొండంత బలం ఇస్తుంటుంది. ఉయ్యాల జంపాల సినిమా అలాంటిదే నాగ్, సురేష్ కలిపి, ఆ…

ఒక్కోసారి చిత్రాలు జరుగుతుంటాయి. చిన్న సినిమాలు చెప్పుకోదగ్గ విజయాలు సాధిస్తుంటాయిు నిజానికి వాటికి వున్న స్టామినా కంటే, ప్రచారం కొండంత బలం ఇస్తుంటుంది. ఉయ్యాల జంపాల సినిమా అలాంటిదే నాగ్, సురేష్ కలిపి, ఆ సినిమాను అలా అలా పైకెత్తారు. 

ఇప్పుడు ఊహలు గుసగుసలాడే సినిమా సంగతి కూడా అలాగే వుంది. కోటి అరవై లక్షల చిన్న సినిమా అది. కానీ కోటి రూపాయిలు పబ్లిసిటీకే ఖర్చు చేసారు. పైగా అక్కడితో ఊరుకోకుండా సాయి తన పరిచయాలన్నీ వాడేసారు. రాజమూళి, కీరవాణి దగ్గర నుంచి తాజగా ఎన్టీఆర్ వరకు అందరూ ఈ సినిమా గురించి ట్వీట్ చేయడమో, ఫేస్ బుక్ లో షేర్ చేయడమో చేసేసారు. 

దాంతో కలెక్షన్లు కుమ్మేయకున్నా, పడిపోకుండా అలా అలా సాగుతున్నాయి. ఇప్పటికి వచ్చింది రెండున్నర నుంచి మూడు వరకు, శాటిలైట్ ఒకటీ డెభై అయిదు. అంటే పెట్టుబడికి రెట్టింపు వరకు లాగేసే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే సాయి స్కీమ్ ఫలించినట్లే అనుకోవాలి.