మళ్లీ అతనితో సమంత రొమాన్స్‌

ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నా కానీ సమంత, సిద్దార్థ్‌ కలిసి నటించింది తక్కువే. జబర్దస్త్‌లో కలిసి నటించిన తర్వాత సమంత, సిద్ధార్థ్‌ మళ్లీ ఇంకో సినిమా చేయలేదు. తమ రొమాన్స్‌ని ఆఫ్‌ స్క్రీన్‌కే…

ఇద్దరూ చాలా కాలంగా రిలేషన్‌లో ఉన్నా కానీ సమంత, సిద్దార్థ్‌ కలిసి నటించింది తక్కువే. జబర్దస్త్‌లో కలిసి నటించిన తర్వాత సమంత, సిద్ధార్థ్‌ మళ్లీ ఇంకో సినిమా చేయలేదు. తమ రొమాన్స్‌ని ఆఫ్‌ స్క్రీన్‌కే పరిమితం చేసిన వీరిద్దరూ వేరే వాళ్లతో కలిసి నటించడానికే మొగ్గు చూపారు. 

ఇద్దరూ కలిసి నటిస్తే తమ రిలేషన్‌ ఎక్కువ ఫోకస్‌ అవుతుందని అనుకున్నారో ఏమో సిద్ధార్థ్‌, సమంత కెమెరా ముందు డిస్టెన్స్‌ మెయింటైన్‌ చేసారు. అయితే త్వరలోనే ఈ కాంబినేషన్‌లో సినిమా చూడబోతున్నామనే టాక్‌ వినిపిస్తోంది. బెంగళూర్‌ డేస్‌ చిత్రాన్ని తెలుగు, తమిళంలో వీరితోనే రీమేక్‌ చేస్తారట. 

సిద్ధార్థ్‌, నాని, సమంత ఇంతవరకు ఈ చిత్రంలో ఓకే అయ్యారని, మిగతా వారిని ఫైనలైజ్‌ చేస్తున్నారని తెలిసింది. బొమ్మరిల్లు ఫేమ్‌ భాస్కర్‌ డైరెక్ట్‌ చేసే ఈ రీమేక్‌ని దిల్‌ రాజు, పొట్లూరి వరప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.