మాస్ హీరోగా ప్రయత్నించిన ప్రతిసారీ బ్యాడ్ రిజల్ట్స్ టేస్ట్ చేసిన నాగ చైతన్య తాజాగా ‘ఆటోనగర్ సూర్య’తో మరో చేదు ఫలితం చవిచూసాడు. దడ, బెజవాడ, ఆటోనగర్ రిజల్ట్స్ చూసిన తర్వాత కొంతకాలం మాస్, యాక్షన్ సినిమాలు కట్టి పెట్టాలని చైతన్య డిసైడ్ అయ్యాడు.
లవ్ స్టోరీలతో ఎక్కువ విజయాలు సాధించిన చైతన్య కొంతకాలం తన బలానికి కట్టుబడి ఉండాలనుకుంటున్నాడు. అందుకే తన తదుపరి చిత్రాలన్నీ యూత్‌ని, ఫ్యామిలీస్‌ని ఆకట్టుకునే సినిమాలే అయ్యేటట్టు చూసుకుంటున్నాడు. చైతన్య నటించిన ‘ఒక లైలా కోసం’ ఆగస్ట్‌లో రిలీజ్ కానుంది.
‘గుండె జారి గల్లంతయ్యిందే’ చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం కూడా రొమాంటిక్ ఎంటర్‌టైనరేనట. స్వామిరారా దర్శకుడు సుధీర్ వర్మ తెరకెక్కిస్తోన్న చిత్రం కూడా యూత్‌ని టార్గెట్ చేసినదే అని సమాచారం. తనకి అచ్చి రాని జోనర్‌లో వేలు పెట్టి చేతులు కాల్చుకోవడం కంటే కలిసొచ్చిన వాటినే నమ్ముకోవడం ఉత్తమమేగా మరి.