ముందుగా ‘బూతు సినిమాల దర్శకుడు’ అని బ్రాండ్ వేయించుకున్న మారుతి కష్టపడి దానిని చెరిపేసుకునే ప్రయత్నం చేసాడు. వెంకటేష్‌తో ‘రాధా’ సినిమా స్టార్ట్ అయ్యే సరికి మారుతి టైమ్ మారిపోయిందని అనుకున్నారు. కానీ ఆ సినిమా అర్థాంతరంగా ఆగిపోవడంతో.. ‘కొత్తజంట’తో తనేంటో చాటుకోవాల్సిన పొజిషన్‌కి వచ్చాడు.
ఆ చిత్రం అంతంత మాత్రంగానే ఆడడంతో మారుతిపై ఇతర హీరోలు పెద్దగా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. నితిన్, సునీల్ తదితరుల్ని మారుతి సంప్రదించినా కానీ ఎవరి నుంచి గ్రీన్ సిగ్నల్ దొరకలేదు. దీంతో ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ మూవీ తీసి తన సత్తా చాటుకోవాలని మారుతి ట్రై చేస్తున్నాడు.
సక్సెస్ కోసం అడల్ట్ స్టఫ్‌ని నమ్ముకుంటే… తర్వాత నిచ్చెన ఎక్కడం ఎంత కష్టమవుతుందో… నమ్మకం కలిగించడం ఇంకెంత క్లిష్టమవుతుందో మారుతిని చూసి తెలుసుకోవచ్చు. చిన్న సినిమాలతోనే విజయాలు సాధించినా కానీ వెంటనే తమ స్థాయి పెంచుకున్న సుధీర్ వర్మ, విజయ్‌కుమార్ కొండా, విక్రమ్ కుమార్ తదితర దర్శకులు యువ దర్శకులకి మార్గదర్శులుగా నిలుస్తున్నారు.