శ్రీనివాస్ అవసరాల డైరెక్ట్ చేసిన ఊహలు గుసగుసలాడే చిత్రానికి రివ్యూలు బ్రహ్మాండంగా వచ్చాయి. ఫీల్ గుడ్ సినిమా అంటూ కితాబులు అందుకుంది. సోషల్ నెట్‌వర్క్‌లో కూడా ఈ చిత్రం బాగానే హల్‌చల్ చేసింది. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా సౌండ్ చేయలేక గుసగుసలతోనే సరిపెట్టింది.
బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం రాకపోయినా కానీ శాటిలైట్ రైట్స్ ద్వారా ఈ చిత్రం పెట్టుబడి సాంతం రాబట్టుకుంది. శాటిలైట్ రైట్స్ పరంగా భారీగా డబ్బులు ధారబోయడం తగ్గిపోయిన దశలో ఈ చిన్న సినిమా కోటీ 75 లక్షలు శాటిలైట్ హక్కుల రూపంలోనే సాధించింది.
ఈ సినిమా థియేటర్లలో సరిగా ఆడకపోయినా కానీ టీవీలో మంచి టీఆర్పీలు సాధించే స్టఫ్ ఉన్నదే. మంచి సినిమా తీసినందుకు ఆ కష్టం వృధా పోదని ఈ చిత్రం నిరూపించింది. అవసరాల శ్రీనివాస్‌కి ఈ చిత్రం మరిన్ని ఆఫర్లు తెచ్చిపెడుతుందో లేదో చూడాలిక.