శ్రీమంతుడా? మగాడా?

పెద్దహీరోల సినిమాలు ప్రారంభం కాకుండానే మాంచి టైటిళ్లు ప్రచారంలోకి వచ్చేస్తాయి. అసలు టైటిల్ డిసైడ్ చేయని, లేదా చేసుకున్నా వెల్లడించలేని సినిమా జనాలు వీటిని వర్కింగ్ టైటిళ్లుగా పాపులర్ చేసేస్తారు. అలాగే పాపులర్ అయింది…

పెద్దహీరోల సినిమాలు ప్రారంభం కాకుండానే మాంచి టైటిళ్లు ప్రచారంలోకి వచ్చేస్తాయి. అసలు టైటిల్ డిసైడ్ చేయని, లేదా చేసుకున్నా వెల్లడించలేని సినిమా జనాలు వీటిని వర్కింగ్ టైటిళ్లుగా పాపులర్ చేసేస్తారు. అలాగే పాపులర్ అయింది మహేష్ సినిమాకు శ్రీమంతుడు అనే టైటిల్.

అయితే ఇప్పుడు ఇది ఉంచుదామా.,.లేక మార్చుదామా అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. మగాడు…అన్న టైటిల్ ఒకటి కన్సిడరేషన్ లో వున్నట్లు తెలుస్తోంది.  ఈనెలాఖరులో ఈ విషయంలో ఏదో ఒకటి తేలుతుంది. ఎందుకంటే నెలాఖరులో కృష్ణ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ బయటకు వస్తుంది. అప్పటికన్నా టైటిల్ ఖరారు చేయాలిగా?